BIG BREAKING: మాగంటి గోపినాథ్‌ కుమార్తెలకు రోడ్డు ప్రమాదం.. పెద్ద కూతురుకు సీరియస్

హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు  ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ కుమార్తెలకు తీవ్రంగా గాయాలయ్యాయి. నార్సింగి TSPA సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 

New Update

హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు  ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ కుమార్తెకు తీవ్రంగా గాయాలయ్యాయి. నార్సింగి TSPA సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.  ముందు వెళ్తున్న DCMను గోపినాథ్‌ కూతుర్లు వెళ్తున్న కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మాగంటి పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. రెండో కుమార్తె స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం వీళ్లకు AIG ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. హైస్పీడ్‌ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి గచ్చిబౌలి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు