/rtv/media/media_files/2026/04/07/lucky-biryani-2026-04-07-18-58-57.jpg)
lucky-biryani-shawarma-sealed in banjarahills
చాలామంది బిర్యానీని ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ మధ్య వీటిని కూడా కల్తీగా మార్చి అమ్మేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నిల్వచేసిన బిర్యానీని ఆన్‌లైన్‌లో అమ్ముతు కొందరు వ్యక్తులు డబ్బులు దండుకుంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఉంటున్న ఓ వ్యక్తి 'లక్కీ బిర్యానీ షవర్మ' అనే హోటల్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశాడు.
Also Read: వందేభారత్‌లో మరోసారి పురుగుల ఆహారం.. ఫుడ్ కంపెనీకి రూ.10 లక్షల ఫైన్
బిర్యానీ ప్యాకెట్ తెరిచాక దుర్వాసన వచ్చింది. అది కుళ్లిపోయిందని గుర్తించిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫుడ్ సెఫ్టీ అధికారులు పోలీసులతో కలిసి ఆ హోట్‌ల్‌పై సోదాలు చేశారు. దీంతో అక్కడ విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసిన 80 బిర్యానీ ప్యాకెట్లను అధికారులు గుర్తించారు.
Biryani Fraud
— Munsif News 24x7 (@MunsifNews24x7) April 7, 2026
Stale biryani stored in fridges for days was allegedly reheated and sold as fresh via online orders. Fake restaurant setup busted in an apartment cellar.
Police have registered a case. Investigation underway.#Hyderabad#Biryani#FoodScam#BanjaraHillspic.twitter.com/VOtkZ5Ft30
Also Read: ప్రియుడే కావాలన్న భార్య.. కానిస్టేబుల్ ముందే గొంతుకోసిన భర్త
జీడిమెట్లలో ఉంటున్న ఇర్ఫాన్ అనే వ్యక్తి ఈ హోటల్‌ను నడిపిస్తున్నాడు. మూడు రోజుల క్రితం తయారు చేసిన బిర్యానీ ప్యాకెట్లను రెడీ.. బంజారాహిల్స్ అవుట్‌లెట్‌లో స్టోర్ చేసి ఉంచుతున్నాడు. ఆర్డర్ వచ్చినప్పుడు వాటిని వేడి చేసి పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఓ ఫ్రిడ్జ్ తెరిచి చూడగా అందులో ఎలుకలు తిరగడం చూసి కంగుతిన్నారు. చివరికి అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Follow Us