/rtv/media/media_files/2025/03/10/eM5556cswMtce7y3iARZ.jpg)
KCR and KTR
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయాక మాజీ సీఎం కేసీఆర్ బయట ఎక్కువగా కనిపించడం లేదు. అసెంబ్లీకి ఓసారి వచ్చినప్పటికీ వెంటనే వెళ్లిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఇంతవరకు ప్రశ్నించలేదు. కేసీఆర్ ఎప్పుడెప్పుడు అసెంబ్లీ వస్తారా అని బీఆర్‌ఎస్ కార్యకర్తలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 12 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారని తెలిపారు.
Also Read: ప్రణయ్ హత్యకేసులో అమృత చెల్లి ఆవేదన.. ‘అంతా అమృతే చేసింది’
ఎమ్మెల్సీ కోటాలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్ ఈరోజు అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయ మీడియాతో మాట్లాడారు. '' 2023లోనే శ్రవణ్‌కు కేసీఆర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. కానీ బీజేపీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు. శ్రవణ్ మా పార్టీ నుంచి వెళ్లిపోయి ఉంటే చట్టసభల్లోకి వెళ్లేవాడు. కానీ మాపై నమ్మకంతో బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాడు.
Also Read: కన్నీటి పర్యంతమైన ప్రణయ్ పేరెంట్స్.. సమాధి వద్ద నివాళి (VIDEO)
తెలంగాణలో రేవంత్ అండ్ టీమ్ చేస్తున్న ప్రైవేటు దోపిడీ పెరుగుతోంది. ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. లేని అప్పులు చూపిస్తూ ఎక్కువ మిత్తిని చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలున్న రేవంత్ తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలి. 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఏ ఒక్క పోరాటమైనా చేసిందా ?. కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ అట్టర్ ప్లాప్. అందుకే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ఈ కారు రేసును ముందుకు తీసుకొచ్చారు. ప్రపంచ సుందరి పోటీలు పెట్టి సీఎం రేవంత్ ఏం సాధిస్తారు ?.200 కోట్లు ఖర్చు పెట్టారు ? ఏం లాభం వస్తుంది, ఎవరికి ఉద్యోగాలు వస్తాయి ?. ఈసారి జరగనున్న బడ్జెట్ సమావేశాలకు విపక్ష నేత కేసీఆర్ హాజరవుతారని '' కేటీఆర్ అన్నారు.
Also Read: టీమిండియా ఫ్యాన్స్‌పై రాళ్ల దాడి.. అర్థరాత్రి అల్లర్లు