Kaushik Reddy Arrest: కౌశిక్ రెడ్డి అరెస్టు.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌ రెడ్డి అరెస్టుపై కేటీఆర్‌ ఎక్స్ వేదికగా స్పందించారు. కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. రోజుకో బీఆర్ఎస్‌ నేతను అన్యాయంగా అరెస్టు చేయడం రేవంత్‌ సర్కార్‌కు అలవాటైందని విమర్శించారు.

New Update
Kaushik Reddy and KTR

Kaushik Reddy and KTR

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని జూబ్లిహిల్స్‌లో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాజాగా ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌ రెడ్డిపై బీఆర్ఎస్‌ వర్కింగ్ కేటీఆర్‌ ఎక్స్ వేదికగా స్పందించారు. '' హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. పూటకో అక్రమ కేసు పెట్టడం.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టుచేయడం రేవంత్ సర్కారుకు ఓ అలవాటుగా మారింది. 

Also Read: గుడ్‌‌న్యూస్.. కొత్త రేషన్ కార్డులకు గైడ్‌లైన్స్ విడుదల

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టుచేయడం పూర్తిగా అప్రజాస్వామికం. హుజూరాబాద్ నియోజకవర్గంలో రైతురుణమాఫీని ఎగ్గొట్టి, దళితబంధుకు పాతరేసిన కాంగ్రెస్ సర్కారును ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకే రేవంత్ ఈ అణచివేత చర్యలకు దిగుతున్నారు. 

Also Read: మహా కుంభమేళా.. యూపీకి రూ.2 లక్షల కోట్ల ఆదాయం !

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సీఎం రేవంత్ రెడ్డిపై చర్య తీసుకోవాల్సిందిపోయి ప్రజల పక్షాన ప్రశ్నించిన కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా ?. పోరాటాలే ఊపిరిగా పుట్టిన గులాబీ పార్టీ నేతల ఆత్మస్థైర్యాన్ని ఇలాంటి చిల్లర చేష్టలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ దెబ్బతీయలేదు. అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని'' రాసుకొచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు