KTR: ముగిసిన ఈడీ విచారణ.. 7 గంటలు చెమటలు పట్టించిన అధికారులు!

కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ-కార్ రేస్ ఇష్యూలో దాదాపు 7 గంటలపాటు కేటీఆర్ ను ఈడీ ప్రశ్నించింది. నగదు బదిలీలకు సంబంధించిన అంశాలపైనే అధికారులు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఈ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

New Update
ktr ed

ktr ed Photograph: (ktr ed)

KTR: కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ-కార్ రేస్ ఇష్యూలో దాదాపు 7 గంటలపాటు కేటీఆర్ ను ఈడీ ప్రశ్నించింది. నగదు బదిలీలకు సంబంధించిన అంశాలపైనే అధికారులు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఉదయం10.30 గంటలకు ఈడీ కార్యాలానికి చేరకున్న కేటీఆర్‌ను విచారణ బృందం చాలా ప్రశ్నలు అడిగింది. 

ఇండియన్ కరెన్సీని పౌండ్లలోకి మార్చి..

ఈ మేరకు ఏసీబీ నమోదు చేసిన ఈ కేసులోనే ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు  నమోదు చేసింది. ఇందులో భాగంగానే గురువారం జరిపిన విచారణలో ప్రధానంగా నగదు బదిలీపైనే ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. రూల్స్ పాటించకుండా ఇండియన్ కరెన్సీని పౌండ్లలోకి మార్చి పంపించడం, హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ కంపెనీకి నిధులు బదలాయింపు, నిధుల బదలాయింపులో ఫేమా నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించి సుదీర్ఘంగా కూపీలాగినట్లు తెలుస్తోంది. అయితే కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది పోలీసులు మోహరించారు. 

ఇది కూడా చదవండి: Mumbai: సైఫ్ కేసులోకి ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు ఎంట్రీ.. వణికిపోతున్న ముంబై మాఫియా!

ఇక ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. వారిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కేటీఆర్ తో వారిద్దరు చేసిన వాట్సాప్ చాట్ ను కూడా ఈడీ సేకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ చాట్ ను చూపించి కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఈడీ కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఈ రోజు ఉదయం నుంచి జోరుగా ప్రచారం సాగింది. కానీ కేటీఆర్ బయటకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. 

ఇది కూడా చదవండి: Ananya nagalla: సంక్రాంతికి అరిసెలు చేసిన అనన్య నాగళ్ల.. వీడియో వైరల్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు