KTR: దమ్ముంటే రాజీనామా చేయి.. చిత్తు చిత్తుగా ఓడిస్తాం.. లగచర్లలో కేటీఆర్ ఫైరింగ్ స్పీచ్!

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏడాదిగా రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. అన్నదమ్ములు, బంధువుల కోసమే పనిచేస్తున్నాడన్నారు. దమ్ముంటే రేవంత్ రాజీనామా చేయాలని, నరేందర్ రెడ్డిపై గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. 

author-image
By srinivas
New Update
ktrrr

KTR

KTR: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏడాదిగా రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు. అనుముల అన్నదమ్ములు, బంధువుల కోసం మాత్రమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారికి మద్దతు ఇవ్వడం కోసం అక్కడికి వెళ్లిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

అల్లుడికి కట్నం కింద లగచర్ల భూములు..

ఏడాదిగా కొడంగల్‌లో కురుక్షేత్ర యుద్ధం నడుస్తోంది. దుర్యోధనుడి పాలనా నడుస్తోంది. ఇక్కడి భూములు గుంజుకోవటం కోసం రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడు. పచ్చని పంటలతో కనిపించిన లగచర్లను నాశనం చేయాలని చూస్తున్నాడు. ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతాడా. కొడంగల్ లో రైతు బంధు, రుణమాఫీ రాలేదు. అల్లుడికి కట్నం కింద లగచర్ల భూములు ఇవ్వాలని చూస్తున్నాడు. లగచర్లలో భూములు ఇవ్వం అని పోరాడిన రైతులపై కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. 

దమ్ముంటే రాజీనామా చెయ్..

ఇక లగచర్ల జ్యోతి సివంగిలా పోరాటం చేసిందని కొనియాడారు. ఇదే కార్యక్రమంలో జ్యోతి బిడ్డకు భూమి నాయక్ అని పేరు పెట్టారు రేవంత్. భూమి కోసం పోరాటం చేశారు కాబట్టి ఆ పేరు పెట్టాను. కొడంగల్ లో రేవంత్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించటం ఖాయం. ఆయన తన సొంత నియోజక వర్గానికి పోవాల్సిందే. అందరూ సంతోషంగా ఉన్నారని రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా.. రేవంత్ రెడ్డి  దమ్ముంటే రాజీనామా చెయ్. మేము ఎవరం ప్రచారం చేయం. నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటే చాలు 50 వేల మెజార్టీ ఖాయం. రేవంత్ రెడ్డి గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. 

ఇది కూడా చదవండి: Sheesh Mahal: శీష్‌ మహాల్‌కు దూరంగా ఢిల్లీ కొత్త సీఎం

అనుముల అన్నదమ్ముల కోసం, అదానీ కోసం, అల్లుడి కోసమే కొడంగల్ నియోజకవర్గంలో సంవత్సరం నుంచి కురుక్షేత్ర యుద్దాన్ని తలపించేలా రేవంత్ రెడ్డి అరాచకాలు చేస్తున్నారన్నారు. తన మనుషులకు వేల కోట్ల రూపాయల విలువైన భూములను దోచిపెట్టడానికే లగచర్ల రైతులపై అక్రమకేసులు బనాయించారని విమర్శించారు. 

ఇది కూడా చదవండి: రంగరాజన్ పై దాడి.. పవన్ ఆదేశాలతో రంగంలోకి జనసేన నేతలు.. చిలుకూరుకు వెళ్లి!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment