Krishna Water Dispute: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల లొల్లి.. అసలేంటి వివాదం ?

ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడిచింది. కానీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఇంకా కృష్ణా నదీ జలాల వివాదం జరుగుతూనే ఉంది. అసలేంటి ఈ వివాదం ?. దీని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Krishna water dispute between Andhra Pradesh and Telangana

Krishna water dispute between Andhra Pradesh and Telangana

ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రం 2014లో అవతరించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటింది. కానీ తెలంగాణ, ఏపీ మధ్య ఇంకా నదీ జలాల వివాదం జరుగుతూనే ఉంది. ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, పాలకులు మారుతున్న కూడా నదీ జలాల వాటా పంపకంలో మాత్రం వివాదానికి తెర పడటం లేదు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటికోసం తెలుగు రాష్ట్రాల మధ్య వాగ్వాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.  

తెలంగాణలో బీఆర్ఎస్‌, ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి సీఎంలు కేసీఆర్, జగన్ ఓసారి సమావేశమయ్యారు. అప్పుడు ఈ నదీ జలాల వివాదం పరిష్కారం అవుతుందని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు మారిపోయాయి. ఇటీవలే సీఎంలు రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు కూడా సమావేశమయ్యారు. కానీ ఈసారి కూడా నదీజలాల పంపకాలకు పరిష్కారం దొరకలేదు. దీనిపై ఇంకా క్లారిటీ లేదు.  

Also Read: సర్కార్ కీలక నిర్ణయం.. ఆ మహిళలకు 60 రోజుల పాటు సెలవులు

కేంద్ర ప్రభుత్వం జోక్యంతో కూడా కొన్నిసార్లు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికులు సమావేశమయ్యారు. అయినప్పటికీ ప్రయత్నాలు ఫలించలేదు. గోదావరి నది జలాల విషయంలో చిన్న వివాదాలు ఉన్నాయి. కానీ కృష్ణా జలాల విషయంలో మాత్రం అలా కాదు. ఇరు రాష్ట్రాలు కయ్యానికి కాలుదువ్వే స్థాయిలో వివాదాలు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయి పదేళ్లు దాటిన నదీ జలాల పంపకాలపై ఇంకా స్పష్టత రాకపోవడం చర్చనీయాంశమవుతోంది. 

అసలేంటి వివాదం ?

దక్షిణ భారత్‌లో ప్రవహించే నదల్లో కృష్ణా, గోదావరి నదులు కీలకమైనవి. ఈ రెండు కూడా తెలంగాణ, ఏపీ మాత్రమే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ప్రవహిస్తాయి. అయితే నదీ జలాలను రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం 1969లోనే బచావత్ అనే కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నదీజలాలను ఏ రాష్ట్రం ఎంత వాడుకోవాలో నిర్ణయించింది. ఇందులో మహారాష్ట్రకు 560 టీఎంసీ, కర్ణాటకకు 700 టీఎంసీ, ఆంధ్రప్రదేశ్‌ 811 టీఎంసీ నీటిని కేటాయించారు. ఇక 2014లో ఏపీతో విడిపోయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కృష్ణా నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగింది. 512 టీఎంసీలుకు ఏపీకి,  తెలంగాణకు 299 టీఎంసీలు వాడుకోవాలనే నిర్ణయం జరిగింది. 

కానీ ఆ తర్వాత దీనిపై వివాదం చెలరేగింది. కృష్ణా నదీ జలాల పంపకాల్లో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ వాదించింది. తమకు అధిక నీటి వాటా కావాలని డిమాండ్ చేసింది. వాస్తవానికి కృష్ణా నది ఎక్కువగా తెలంగాణలోనే ప్రవహిస్తుంది. కాబట్టి ఏపీ కంటే తమకే ఎక్కువ నీళ్లు రావాలని అడుగుతోంది. ఉమ్మడి ఏపీలో కేటాయించిన 811 టీఎంసీల్లో 70 శాతం అంటే 558 టీఎంసీలు తమకే రావాలని తెలంగాణ వాదిస్తోంది. 50:50 వాటా కావాలనే డిమాండ్‌ కూడా గతంలో కేసీఆర్ చేశారు.

Also Read: ఇలా అయితే హైడ్రాను మూసేయాల్సొస్తుంది..హైకోర్టు

మరోవైపు తెలంగాణ వాదనను ఏపీ ఖండిస్తోంది. కృష్ణా జలాల్లో తమకే ఎక్కువ వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. ఇలా వాటాలపైనే ఇరు రాష్ట్రాల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ కృష్ణా నదిపై నిర్మిచే ప్రాజెక్టులపై కూడా తెలంగాణ, ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు ఏపీ అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తోందని తెలంగాణ.. మరోవైపు తెలంగాణ అక్రమంగా నిర్మిస్తోందని ఏపీ అంటున్నాయి. దీంతో ఇలా కృష్ణా నదీ జలాలపై వివాదానికి తెరపడటం లేదు.  

ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణలో ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వ, పంటల సాగుకు నీటి విడుదల వంటి అంశాలపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి కృష్ణా జలాల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పిటికే ఏపీ నిర్ణీత వాటా కంటే ఎక్కువగా నీటిని తరలించుకుపోతుందని.. దీనివల్ల తెలంగాణ వినియోగానికి నీరు ఉండటం లేదని అన్నారు. అందుకే ఏపీ నిర్ణీత కోటా కన్నా ఎక్కువ తరలించుకుండా జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. శ్రీశైలం, నాగార్జు సాగర్‌ ప్రాజెక్టుల నుంచే ఏపీ ఎక్కువగా నీటి వాటాను తరలిస్తోందని తెలంగాణ ఆరోపణలు చేస్తోంది.

సమావేశం వాయిదా

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి కూడా ఇటీవల దీనిపై మాట్లాడారు. కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలిస్తోందని ఆరోపించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి ఇరు రాష్ట్రాల మధ్య దుమారం రేపాయి. దీన్ని పరిష్కరించేందుకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB) అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ ఏపీ విజ్ఞప్తి మేరకు ఈ సమావేశం ఫిబ్రవరి 24కి వాయిదా పడింది. 

Also Read: నోరు పైలం జర...కేసీఆర్ కు కమ్యూనిస్టుల వార్నింగ్

మరోవైపు కృష్ణా జలాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు కూడా రేవంత్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణా జలాలను ఏపీ ఎత్తుకెళ్తున్న కూడా రాష్ట్ర సర్కార్ మొద్దు నిద్ర వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్‌ కుడి కాల్వ నుంచి ఏపీ ప్రభుత్వం ప్రతీరోజు 10 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తోందని అయినప్పటికీ రేవంత్ ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చోందని ఎద్దేవా చేశారు. 

కేంద్రంపై ఒత్తిడి తేవాలి

ఈ ఏడాది కృష్ణాలో 1010 టీఎంసీల నీళ్లు రాగా.. ఇందులో ఏపీకి 666 టీఎంసీలు, తెలంగాణకు 343 టీఎంసీలు వాడుకోవాలనే నీటి ఒప్పందం జరిగినట్లు చెప్పారు. ఏపీ ఇప్పటికీ 657 టీఎంసీలు నీరు తరలించుకున్నట్లు తెలిపారు. కానీ తెలంగాణ 343 టీఎంసీలకు కేవలం 220 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుందని అన్నారు. ప్రస్తుతం ఏపీకి 9 టీఎంసీలే మిగిలి ఉన్నాయని.. కానీ తెలంగాణకు 123 టీఎంసీలు రావాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏపీకి నీటి విడుదలను ఆపేసి తెలంగాణ వాటాను దక్కించుకోవాలని డిమాండ్ చేశారు. 

Also Read: జగన్ కు ఊహించని షాక్.. ఆ నేతలంతా జనసేనలోకి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ladies Hostels : అర్థరాత్రి దొంగ హల్ చల్  లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి...

అర్థరాత్రి పూట లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి యువతుల బ్యాగులు దొంగిలిస్తున్నాడు ఓ దొంగ. అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్‌ టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

New Update
Girls Hostels

Girls Hostels

Ladies Hostels  : అర్థరాత్రి పూట లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి యువతుల బ్యాగులు దొంగిలిస్తున్న ఓ దొంగ వ్యవహారం మధురానగర్ లో చోటు చేసుకుంది.ఆ దొంగ అర్ధరాత్రి దాటాక రెండు లేడీస్ హాస్టల్స్‌లోకి దర్జాగా చొరబడి యువతుల ల్యాప్‌ టాప్‌లతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం మహబూబాబాద్‌కు చెందిన సింధు(29) నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ.. మధురానగర్‌లోని శ్రీ సాయి సద్గురు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో గత ఐదేళ్ల నుంచి ఉంటుంది. తన బ్యాగులో ల్యాప్‌టాప్, ఏటీఎం కార్డ్, ఆధార్ కార్డ్, మరికొన్ని సర్టిఫికెట్స్‌ను దాచుకుని నిద్రపోయింది. సోమవారం అర్ధరాత్రి దాటాక 3 గంటల సమయంలో ఓ దొంగ లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించాడు. బ్యాగును చోరి చేసి అక్కడి నుంచి ఉడాయించాడు.

Also read: Instagram loveG: ప్రేమ గుడ్డిది మావా.. ఇన్‌స్టాగ్రామ్ లవర్ కోసం అమెరికా నుంచి ఆంధ్రా వచ్చిన యువతి

తెల్లారక చూసుకుంటే తన బ్యాగ్ కనిపించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఏపీ మంగళగిరికి చెందిన యువతి కె.మనస్వి (24) నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ మధురానగ‌ర్‌లోని రామిరెడ్డి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నివాసం ఉంటుంది. సోమవారం రాత్రి హాస్టల్లోని రూమ్‌లో మనస్వి గాఢనిద్రలో ఉన్నప్పుడు ఓ దొంగ జొరబడ్డాడు. ల్యాప్ టాప్, ఛార్జర్, విలువైన వస్తువులను బ్యాగులో దాచుకుంది. మనస్వి నిద్రలోకి జారుకున్నాక ఆమె రూమ్‌లోకి దొంగ జొరబడి బ్యాగును అపహరించి పరారయ్యాడు.రెండు హాస్టళ్లలో చోరి చేసి బ్యాగులతో దొంగ ఉడాయించడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఓ లేడీస్ హాస్టల్లో వాచ్‌మెన్ లేకపోవడం.. మరో హాస్టల్లో వాచ్‌మెన్ ఉన్నా అతను నిద్రపోవడంతో దొంగకు అడ్డంకులు లేకుండా పోయాయి. లాభాపేక్షతో హాస్టళ్లను నిర్వహిస్తూ భద్రతను గాలికొదిలేశారని బాధిత యువతులు వాపోయారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే లేడీస్ హాస్టల్లో దూరింది దొంగా లేదా ప్రియుడా అనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ఎందుకంటే బయటకొచ్చిన సీసీ ఫుటేజ్‌ను చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయి. హాస్టల్ లోపలికి వచ్చే డోర్ కాస్తా ఓపెన్ చేసి ఉంది.సాధారణంగా డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. లేదా ఓపెన్ చేసి ఉంటుంది. కానీ హాస్టల్ డోర్ కొంచెం మాత్రం ఓపెన్ అయిన ఉండటం వీడియోలో చూడవచ్చు. అలాగే లోపలికి వచ్చిన వ్యక్తి కూడా తన ఫేస్‌కు ఎలాంటి మాస్క్ ధరించలేదు. సాధారణంగా దొంగతనం చేసే వ్యక్తి, తన ఫేస్ కనిపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ ఇక్కడ అలాంటిది ఏదీ కూడా జరిగినట్టు కనిపించడం లేదు. పైగా అతను గోడ దూకి వెళ్లినప్పుడు అతని దగ్గర ఉన్న బ్యాగ్ కూడా అంత బరువుగా ఉన్నట్టు కనిపించలేదు. దీంతో వచ్చింది అసలు దొంగనే అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో ఉన్న యువతి కోసం సదరు వ్యక్తి వచ్చి ఉండవచ్చనే అభిప్రాయాన్ని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also read: BIG BREAKING: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

 
Advertisment
Advertisment
Advertisment