Kothagudem Corporation : తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపాలిటీ ఎన్నిక(Telangana Municipal Election 2026) ల్లో అధికార కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలను నమోదు చేసుకుంది. అయితే కొత్తగూడెం కార్పొరేషన్ లో మాత్రం ఎవరూ ఊహించని విధంగా సీపీఐ పార్టీ తన సత్తా చాటింది. కొత్తగూడెం కార్పొరేషన్‌లోని 60 డివిజన్లలో 22 డివిజన్లను సీపీఐ గెలుచుకుంది. దీంతో మేయర్ పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ తరుణంలో ఆ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొత్తగూడెం మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని స్పష్టం చేశారు. అంతేకాక మేయర్ పదవి గిరిజనులకే ఇస్తామని కూడా వెల్లడించారు. కొత్తగూడెంలో ప్రజలు సీపీఐని ఆదరించారన్న ఆయన కేటీఆర్ మాకు ఫోన్ చేసి మద్దుతు ప్రకటించారని తెలిపారు. ఇండిపెండెంట్లు కూడా మద్దుతు ఇస్తున్నారన్నారు. అయితే మేం కాంగ్రెస్‌తో ఇంకా చర్చించలేదన్న కూనంనేని(kunamneni-sambasiva-rao) పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని ప్రకటించారు.
Also Read : ఎమ్మెల్యే సంజయ్ వల్ల జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ పతనం.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
CPI MLA Koonamneni Comments On Kothagudem Mayor's Post
కాగా, కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లు ఉండగా సీపీఐ(cpi) 22 వార్డులను గెలుచుకుంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి 22, బీఆర్ఎస్(brs) పార్టీకి 8, సీపీఎం 1, బీజేపీ 1, స్వతంత్రులు 6 స్థానాల్లో విజయం సాధించారు. అయితే కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మేజిక్ ఫిగర్ 31 కాగా.. సీపీఐ పార్టీకి మరో 9మంది కార్పొరేటర్ల మద్దతు అవసరం కానుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సీపీఐ పార్టీకి ఏ పార్టీ మద్దతు తెలుపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే బీఆర్ఎస్ నేత కేటీఆర్ సీపీఐకి మద్దతు ఇస్తామని ప్రకటించారు. దీంతో సీపీఐ సంఖ్య 30 కి చేరుతుంది. మరో కమ్యూనిస్టు పార్టీ సీపీఎం ఒక స్థానంలో గెలవడంతో ఆ పార్టీ ఎలాగు సీపీఐకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో మేయర్ పీఠం సీపీఐకి దక్కనుంది. ఒకవేళ సీపీఐ కాంగ్రెస్ తో జతకడితే ఇతర పార్టీల మద్దతు లేకుండానే మేయర్ పీఠం దక్కించుకోగలదు. అయితే సింగరేణి విషయంలో కాంగ్రెస్ తో విభేదిస్తున్న సీపీఐ కాంగ్రెస్ ను కాదనుకుంటే బీఆర్ఎస్, సీపీఎం, ఇండిపెండెంట్ల మద్దతుతో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోగలదు.
Also Read : మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాం : కేటీఆర్
Kothagudem Corporation : కొత్తగూడెం మేయర్ స్థానం మాదే.. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలను నమోదు చేసుకుంది. అయితే కొత్తగూడెం కార్పొరేషన్ లో మాత్రం ఎవరూ ఊహించని విధంగా సీపీఐ పార్టీ తన సత్తా చాటింది. మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని సీపీఐ స్పష్టం చేసింది.
kunamneni sanbasiva rao