ఎంతో ప్రాసశ్త్యమున్న భద్రాద్రి రామన్న శ్రీరామ నవమి ఉత్సవాలకు ఈసారి ఆదిలోనే ఆటంకం ఏర్పడింది. ఉత్సవాలకు ముందు చేసే అంకురార్పణ ఆలయ ఈవో, అర్చకుల మధ్య గొడవలతో లేట్ అయింది. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు మొదలు కావాల్సిన క్రతువు రాత్రి 9.45 గంటలకు ప్రారంభం అయింది.
అసలేం జరిగింది...
ప్రతిఏటా పాల్గుణ శుద్ధ పౌర్ణమి ముందురోజు నాడు శ్రీసీతారమచంద్రస్వామి దేవస్థానంలో అంగరంగవైభవంగా అంకురార్పణ పూజ జుగుతుంది. దీని తర్వాత మర్నాడు భధ్రాచలం దేవస్థానంలో శోభాయమానంగా శ్రీసీతారాముల కళ్యాణ క్రతువు తొలిఘట్టం మొదలువుతుంది. అంకురార్పాణ పూజలో భాగంగా వసంతోత్సవం, డోలోత్పవం లాంటివి చేస్తారు. దీని కోసం అనువంశికంగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా అంకురార్పణ పూజను ప్రతి ఏటా ఓ అర్చకుడిని ఎంపికచేసుకుని కల్యాణ బ్రహ్మగా క్రతువును జరిపిస్తారు భద్రాచలంలో అర్చకులు. ఈసారి కల్యాణ బ్రహ్మగా శ్రీవివాస రామానుజాచార్యులను ఎంపిక చేసుకున్నారు.
అయితే అంకురార్పణ పూజకు ఆయన హాజరు కాలేదు. దానికి కారణం కల్యాణ బ్రహ్మ అయినటువంటి శ్రీనివాస రామానుజాచార్యులును స్వామివారి అనుసంధాన ఆలయం పర్ణశాల రామాలయంలో పూజలు నిర్వహించాలని ఆలయ ఈవో రమాదేవి అదేశంచడమే అని తెలుస్తోంది. అయితే ఈ పూజలు ప్రతీ యేటా భద్రాచలం మెయిన్ గుడిలోనే నిర్వహిస్తారు. అందుకే పర్ణశాలలో అంకురార్పణ చేయడానికి కల్యాణ బ్రహ్మ ఒప్పుకోలేదు. ఇది ఈవో, ఆయ అర్చకుల మధ్య గొడవకు దారి తీసింది. కళ్యాణ బ్రహ్మ శ్రీనివాస రామానుజాచార్యులు హాజరుకాకపోవడం వల్లే అంకురార్పణ క్రతువు నిలిచిపోయిందంటున్న ఆలయ అర్చకులు చెప్పారు. ఈవో రమాదేవి వైఖరిపై అర్చకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఈవో రమాదేవి అర్చకులను అనుమానిస్తున్నారని...ఆలయం లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కల్యాణ బ్రహ్మ వస్తేనే అంకురార్పణ ముందుకు సాగుతుందని తేల్చి చెప్పేశారు. మరోవైపు కల్యాణ బ్రహ్మగా శ్రీనివాస రామానుజపై అభ్యంతరాలున్నాయనంటున్న ఈవో రమాదేవి మొండి పట్టదలపట్టుకుని కూర్చొన్నారు.
ఆర్టీవీ ప్రసారాలతో కదలిక...
ఈమొత్తం వ్యవహారాన్ని ఆర్టీవీ ప్రసారం చేసింది. దీంతో అంకురార్పణ పూజ ఆలస్యం గురించి అందరికీ తెలిసిపోయింది. ఆర్టీవీ ప్రసారాలతో దెబ్బకు భధ్రాచలం దేవస్థాన ఆలయ కార్యనిర్వాహక విభాగం పరుగులు పెట్టింది. ఈవో రమాదేవి కూడా దిగి వచ్చారు. తన పట్టుదలను పక్కన పెట్టి అంకురార్పణ పూజ జరిగేందుకు అనుమతినిచ్చారు. దీంతో ఎట్టకేలకు 9:45 నిమిషాలకు అంకురార్పణ పూజ మొదలైంది.
Also Read: Chattisghar: ఛత్తీస్ ఘడ్ లో 17 మంది మావోయిస్టుల లొంగుబాటు...