Khammam: ఖమ్మం యువకుడు సంజయ్ మృతి కేసులో మిస్టరీ వీడలేదు. ఘటన జరిగి వారం గడుస్తున్నా మృతికి గల కారణాలు తెలియకపోవడం సంచలనం రేపుతోంది. ఈ కేసు చేధనలో తొంభై శాతం విచారణ పూర్తి చేశామంటున్న పోలీసులు.. ఎలాంటి విషయాలను బయటకు వెల్లడించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంజయ్ ఎండ్ లొకేషన్ ఆధారంగా కాల్ డంప్ ను సేకరించి ఇప్పటికే పలువురు వ్యక్తులను పోలీసులు విచారించగా ఎలాంటి ఆధారాలు లభించనట్లు తెలుస్తోంది.
శరీరంపై ఎటువంటి గాయాలు లేవు..
ఈ క్రమంలోనే పోలీసుల చేతిలో పందెపు సంజయ్ కుమార్ పోస్టుమార్టం రిపోర్ట్ ఉండగా.. శరీరంపై ఎటువంటి గాయాలు లేవని పీఎంఈ రిపోర్ట్ తేల్చేసింది. కేసు పరిష్కారంలో కీలకమైన ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం పోలీసుల ఎదురుచూస్తున్నారు. సంజయ్ ఫోన్ డామెజ్ అవ్వడంతో డేటా రికవరీ కోసం పోలీసుల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సంజయ్ కేసును చేధించేందుకు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: పోతూ.. పోతూ.. వీళ్లను ట్రంప్ నుంచి కాపాడటానికి జో బైడెన్ కీలక నిర్ణయం
అసలేం జరిగిందంటే..
ఖమ్మం పోలెపల్లి రాజీవ్ గృహ కల్పలో బాధితుడు సంజయ్ కుమార్ కుటుంబం నివాసం ఉంటోంది. అయితే సంజయ్ అన్న సాయి హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగకోసం సోమవారం సాయంత్రం ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలోనే తాను ఖమ్మం కొత్త బస్టాండ్ లో దిగేవరకు రాత్రి 1:30 అవుతుందని ఆ సమయంలో తనను రిసీవ్ చేసుకోవడానికి రావాలని తమ్ముడు సంజయ్ కి ఫోన్ చేశాడు. దీంతో 1గంటకు ఖమ్మం బయలు దేరిన సంజయ్.. మార్గమధ్యలో తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని, అన్నా నన్ను చంపేస్తారంటూ సాయికి వాట్సప్ లో వాయిస్ మెసేజ్ పంపించాడు. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి గాలించారు. చివరికి మూడు రోజులకు చెరువులో శవమై తేలాడు.
ఇది కూడా చదవండి: Kavitha: ఎమ్మెల్సీ కవిత ఫొటోలు మార్ఫింగ్.. బీజేపీ ఎంపీపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు!