/rtv/media/media_files/2025/03/02/pI4htvUyrn8gp2lJ5a0M.jpg)
Key Update on Group Exams Results
తెలంగాణలో ఇటీవల గ్రూప్-1,2,3 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఫలితాలు ఎప్పుడొస్తాయా అని అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గ్రూప్ ఫలితాలపై తాజాగా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. టీజీపీఎస్సీ.. ముందుగా గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి 10వ తేదీలోగా ఈ లిస్ట్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.
Also Read: రైతులకు రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్.. సీఎం కీలక ప్రకటన
ఆ తర్వాత టీజీపీఎస్సీ గ్రూప్ 2,3 ఫలితాలను ప్రకటించనుంది. 2,374 పోస్టుల భర్తీ కోసం గ్రూప్-1,2,3 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 5,51,247 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పిన జాబ్ క్యాలెండర్‌పై దృష్టి పెట్టింది. ఈ మేరకు ఈ ఏడాది మే నుంచి కొత్త ఉద్యోగాల ప్రకటనలకు టీజీపీఎస్సీ కసరత్తులు చేస్తోంది.
Also Read: 4వేల ఎకరాల్లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి - 80కి పైగా భవనాలు దగ్ధం..!
మార్చి 31 నాటికి రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల సంఖ్యను అందజేయాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాస్తామని ఇటీవలే టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ క్రమంలోనే ఏప్రిల్‌లో ఈ అంశాలపై చర్చిస్తామన్నారు. మే 1 నుంచి నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పారు.
Also Read: కేసీఆర్ వల్లే SLBC టన్నెల్ కూలింది.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Also Read: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!
ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!
మంత్రి పొంగులేటి తనని.. కేసీఆర్ ఆత్మ అని అంటున్నారు..కేసీఆర్ లేకుంటే పొంగులేటి ఎక్కడ ఉండేవాడని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు కాకపోయిన ఇంకొద్దిరోజులు కైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని... వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు.
తాను కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తాను అన్నవి తన సొంత మాటలు కావని.. రాష్ట్రంలో ఉన్న చాలామంది ప్రజలు తమ వద్దకు వచ్చి అంటున్న మాటలని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మారాలి అని రైతులు..రియల్టర్లు, పారిశ్రామిక వేత్తలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. మంత్రి పొంగులేటి తనని.. కేసీఆర్ ఆత్మ అని అంటున్నారు..కేసీఆర్ లేకుంటే పొంగులేటి ఎక్కడ ఉండేవాడని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు పొంగులేటి మంత్రి పదవిలో ఉన్నాడు అంటే..అది కేసీఆర్ వల్లేనని తెలిపారు. కాంగ్రెస్ నాయకులకు వాళ్ల ప్రభుత్వం పై నమ్మకం లేకనే తమ పార్టీ నుండి పదిమంది ఎమ్మెల్యే లను తీసుకెళ్లారని విమర్శించారు. ఇప్పుడు కాకపోయిన ఇంకొద్దిరోజులు కైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని... వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం పక్క అని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని...తనను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు కొత్త ప్రభాకర్ రెడ్డి.. తాను కేసులకు భయపడేవాన్ని కాదని తేల్చి చెప్పారు. కచ్చితంగా తాను పారిశ్రామికవేత్తనని.. కానీ డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు. సేవ చేయడానికి మాత్రమే వచ్చానని ఆర్టీవీకీ ఆయన తెలిపారు.
ఎర్రబెల్లి బస్తిమే సవాల్
రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి వర్గ విస్తరణ పూర్తి కాగానే ప్రభుత్వం కుప్పకూలిపోతుందని అన్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు చీఫ్ గెస్టుగా పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేందుకు ప్రభుత్వం భయపడుతుందని అన్నారు. రాసిపెట్టుకోండి.. స్థానిక సంస్థల్లో వార్ వన్ సైడ్.. ఎప్పుడు ఎన్నికలు పెట్టిన సరే.. బీఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమని ఎర్రబెల్లి అన్నారు. సర్వేలన్ని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నాయన్న ఎర్రబెల్లి.. ఎన్నికలు పెట్టి చూడండి .. తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. తాను చెప్పింది నిజం కాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎర్రబెల్లి సవాల్ విసిరారు. మొత్తం రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. అందులో కేవలం 10 నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఫేవర్‌గా ఉందని.. మిగతా చోట్ల బీఆర్ఎస్ పార్టీ గెలుస్తోందని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం బయటపడుతోందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
Sisters commit suicide : ఎంత కష్టమొచ్చిందో.. పురుగుల మందు తాగి అక్క చెల్లెలు ...
🔴Live News Updates: న్యూస్ అప్డేట్స్
పశ్చిమ బెంగాల్లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి
MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్
Telangana Women's Commission : శ్రీవర్షిణి కి షాక్...అఘోరీ శ్రీనివాస్ అరెస్ట్ ?