Telangana: తెలంగాణ అక్రిడిటేషన్‌ కార్డులపై కీలక అప్‌డేట్‌..

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌కు సంబంధించి సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్. ప్రియాంక కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని తెలిపారు.

New Update
Accreditation Cards-in-telangana

accreditation Cards in telangana

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌కు సంబంధించి సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్. ప్రియాంక కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని తెలిపారు. అప్లికేషన్ల ప్రక్రియపై మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై జర్నలిస్టులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.  ఏప్రిల్ 10న జరిగే రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీ మీటింగ్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తామన్నారు. అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. 

Also Read: యుద్ధం ఎఫెక్ట్ :  మందుబాబులకు బిగ్ షాక్.. పెరగనున్న బీరు రేటు..!

అర్హులైన జర్నిలిస్టులు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు అప్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.త్వరలోనే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అలాగే జిల్లా స్థాయిలో కూడా ఈ నెలలోనే జిల్లా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. కాబట్టి జిల్లా స్థాయిలో దరఖాస్తు చేసుకునే అర్హులైన జర్నలిస్టులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవాలని కోరారు.  

Also Read: జిల్లాల హద్దుల మార్పులు అప్పుడే.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

Advertisment
తాజా కథనాలు