/rtv/media/media_files/2026/05/12/kcr-2026-05-12-14-25-28.jpg)
KCR
ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో పార్టీ ముఖ్యనేతలతో KCR కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఇన్‌చార్జుల నియామకం అంశాలపై దిశానిర్దేశం చేశారు. అయితే పనిచేయని నాయకులకు ఈసారి టిక్కెట్లు ఉండవని అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరంతరం ప్రజల్లో ఉండాలన్నారు. ప్రభుత్వ అవినీతి, హామీల అమలుపై పోరాటానికి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.
Also Read: బండి భగీరథ్ పోక్సో కేసు... బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్
పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాల నిర్వహణపై కూడా కేసీఆర్ సూచనలు చేశారు. జిల్లా పరిషత్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేషన్ల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణపై బీజేపీ ఫోకస్, ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కూడా చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.
Follow Us