BIG BREAKING: కవిత కొత్త పార్టీ పేరు ఇదే.. కానీ కోర్టులో చిక్కులు

తెలంగాణ జాగృతి చీఫ్‌ కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు. 'తెలంగాణ ప్రజా జాగృతి' పేరుతో కొత్త రాజకీయ పార్టీ నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమె జనవరి 23న దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

New Update
Kavitha's New party named as 'Telangana Praja Jagruti

Kavitha's New party named as 'Telangana Praja Jagruti

తెలంగాణ జాగృతి చీఫ్‌ కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు. 'తెలంగాణ ప్రజా జాగృతి' పేరుతో కొత్త రాజకీయ పార్టీ నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమె జనవరి 23న దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లో సెక్షన్ 29ఎ ప్రకారం రాజకీయ పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి నిర్ణయం ప్రకటించేలా త్వరగా ఆదేశాలు చేయాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టుకు దరఖాస్తు పంపారు.

Also Read: KCRకు సీఎం రేవంత్ బిగ్ షాక్.. అసెంబ్లీకి రాకుండానే కోటి 8 లక్షల జీతం

కానీ కవిత పంపిన దరఖాస్తులో చాలా లోపాలు ఉన్నాయని ఫిబ్రవరి 23నే ఆమెకు సమాచారం పంపినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది ఫిబ్రవరి 27న విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టులో చెప్పారు. ఈ కానీ ఆరోజు కవిత తరఫు న్యాయవాది ఆస్పత్రిలో ఉండటంతో విచారణకు హాజరుకాలేకపోయారు. చివరికి ఈ కేసు మార్చి 19కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే గురువారం ఈ పటిషన్‌పై మళ్లీ విచారణ జరగనుంది.  

Also Read: LPG గ్యాస్ సిలిండర్ల కొరతకు గుడ్‌బై.. దేశవ్యాప్తంగా గ్యాస్ ATM ఏర్పాట్లు !

Advertisment
తాజా కథనాలు