Kavitha: కవిత కొత్త పార్టీ..  ముహుర్తం ఖరారు..ఎప్పుడు, ఎక్కడంటే ?

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది. మరో కొత్త పార్టీ త్వరలో ఎంట్రీ ఇవ్వబోతుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇప్పుడు తన సొంత రాజకీయ ప్రస్థానాన్ని ఖరారు చేసుకున్నారు.

New Update
Kavitha

Kavitha

BIG BREAKING: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది. మరో కొత్త పార్టీ త్వరలో ఎంట్రీ ఇవ్వబోతుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(kalvakuntla-kavitha), ఇప్పుడు తన సొంత రాజకీయ ప్రస్థానాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ నెల మార్చి 27న శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, తన మెట్టినిల్లు అయిన నిజామాబాద్ వేదికగా ఆమె కొత్త పార్టీపై కీలక ప్రకటన చేయబోతున్నారు.

Also Read :  రేవంత్ నువ్వే నా మీద పోటీ చేయ్ .. హరీష్ సవాల్!

రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ

శ్రీరామనవమి రోజు ఉదయం 8:30 గంటలకు నిజామాబాద్‌లో ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో కవిత తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగానే పార్టీ పేరు, జెండా, ఎజెండా, విధివిధానాలను ఆమె వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రజా జాగృతి"(TPJ) అనే పేరును కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం.

ఏప్రిల్ 25న మేడ్చల్ పరిధిలో సుమారు లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించి, అధికారికంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత భావిస్తున్నారు. ఈ సభకు పలువురు జాతీయ స్థాయి నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కొత్త పార్టీ ద్వారా కవిత ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై కూడా క్లారిటీ రానుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఆమె బోధన్ లేదా సిద్దిపేటలో ఏదో ఒకదానినుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. 

Also Read :  అల్వాల్‌లో దారుణం.. తల్లిని చంపి ఇంట్లో పాతిపెట్టిన కూతురు!

Advertisment
తాజా కథనాలు