/rtv/media/media_files/2025/03/27/MD87YVBXatadefoPJERJ.jpg)
kanmareddy Photograph: (kanmareddy)
TG Crime: తెలంగాణ కామారెడ్డి జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఫ్రెండ్లీ పోలిస్ అనే నినాదాన్ని మరిచి ఓ ఇద్దరు కానిస్టేబుల్, హోం గార్డు దారుణానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తని గొడ్డులా బాదారు. వద్దని వేడుకుంటున్న పట్టించుకోకుండా విచక్షణ రహింతగా కొట్టారు. పరిగెత్తుతున్న వదిలిపెట్టకుండా వెంటపడి కర్రలతో వీపులో వాతలొచ్చేలా కొట్టారు. ఈ ఘటన బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగగా వివరాలు ఇలా ఉన్నాయి.
మద్యం మత్తులో వ్యక్తి న్యూసెన్స్ ..
— News Line Telugu (@NewsLineTelugu) March 27, 2025
నడిరోడ్డుపై చితకబాదిన పోలీసులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి న్యూసెన్స్ చేస్తున్నాడని నడిరోడ్డుపై వ్యక్తిని చితకబాదిన కానిస్టేబుల్ కిరణ్,హోంగార్డు గంగాధర్
నడిరోడ్డుపై విచక్షణా రహితంగా కొట్టడంతో జిల్లా ఎస్పీకి… pic.twitter.com/IJmUMr2blB
మాకే ఎదురుతిరుగుతావా..
ఈ మేరకు బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ కిరణ్, హోంగార్డు గంగాధర్ గస్తీ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే వారికి ఓ వ్యక్తి మద్యం తాగి కనిపించాడు. దీంతో ఓ వ్యక్తిని అక్కడినుంచి ఇంటికి వెళ్లమని చెప్పారు. కానీ మత్తులో ఉన్న అతను వారి మాట వినలేదు. ఈ క్రమంలో మాటమాట పెరగగా ఏదో అన్నాడు. దీంతో మాకే ఎదురుతిరగతావా అంటూ ఇద్దరు కలిసి అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
Also Read: 'బొంబాయికి రాను' సాంగ్ సరికొత్త రికార్డ్.. 5 లక్షల పెట్టుబడి... వచ్చింది ఎన్ని లక్షలో తెలుసా?
అయితే ఇదంతా అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రకు తెలిసింది. కానిస్టేబుల్, హోంగార్డుపై తీవ్ర విమర్శలు రావడంతో ఇద్దిరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. కిరణ్, గంగాధర్ ను విధుల నుండి సస్పెండ్ చేశారు.
Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
conistable | homegaurd | attack | today telugu news