/rtv/media/media_files/2026/02/22/fotojet-35-2026-02-22-15-22-33.jpg)
MLA Rajasingh arrested
BIG BREAKING : కామారెడ్డి లో శనివారం చోటు చేసుకున్న రాజకీయ ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. నిన్నటి నుంచి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు కామారెడ్డి వెళ్లితీరుతామని తేల్చి చెప్పిన బీజేపీ నేతల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు కామారెడ్డి వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అన్ని రూట్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అదే సమయంలో వారు కామారెడ్డి వెళ్లకుండా నిరోధించడంతో పాటు, రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ముఖ్యనేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బాన్సువాడ వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆయనను సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాన్సువాడ, కామారెడ్డిలలో ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో అక్కడికి వెళ్లడానికి వీలులేదని పోలీసులు చెప్పగా ఆయన వెళ్లి తీరుతానని పట్టుబట్టడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ ఉదయం కామారెడ్డి వెళ్లడానికి ప్రయత్నించిన తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు(BJP Chief Ramchander Rao) ను తార్నాకలోని ఆయన నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. అయినా ఆయన కామారెడ్డికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/02/22/fotojet-36-2026-02-22-15-23-09.jpg)
Also Read : బాలయ్య ఇంటి వద్ద బీభత్సం.. నాలుగు కార్లు ధ్వంసం!
అసలేం జరిగిందంటే...
మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం కామారెడ్డి చైర్మన్ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి(Kamareddy BJP MLA Venkata Ramana Reddy)తోపాటు ఆయన తండ్రిపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపణలు చేశారు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం మొదలైంది.కామారెడ్డిలో కాలేజీ భూముల కబ్జా విషయంలో గొడవ మొదలైంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్. బీజేపీ నేతల ఆరోపణలతో మొదలైన లొల్లి కామారెడ్డిలో టెన్షన్ వాతావరణానికి దారితీసింది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు బహిరంగ చర్చకు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు, శిశు మందిర్ పాఠశాల, అరోరా కాలేజీ భూముల కబ్జా విషయంలో స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు నడుస్తున్న క్రమంలో ఈ వివాదం మరింత ముదిరింది. షబ్బీర్ అలీ అవినీతిపై నిజా నిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి సవాల్ చేశారు.
ఆయన సవాలుకు ప్రతి సవాలు విససురుతూ చర్చకు సిద్ధమన్న కాంగ్రెస్ నేతలు కూడా సై అంటే సై అన్నారు. శిశు మందిర్ వేదికగా చర్చకు రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకులు సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి వారికి సవాల్ విసిరారు. అయితే.. కాంగ్రెస్, బీజేపీ నేతల సవాళ్లతో కామారెడ్డిలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు.
కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములకు సంబంధించి తనపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో తాము కూడా వస్తామని కాంగ్రెస్​ నాయకులు పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పలువురిని హౌస్ అరెస్టు చేశారు. ఎక్కడికక్కడ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ గా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్యే రమణారెడ్డి క్యాంపు కార్యాలయంతో పాటు, షబ్బీర్ అలీ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరించారు. మొత్తం ఎక్కడికక్కడ బీజేపీ నేతలను కట్టడి చేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.
Also Read : సాఫ్ట్‌వేర్ సునీత కేసు.. డెడ్‌బాడీ తీసుకెళ్లని భర్త.. ఎందుకో తెలిస్తే షాక్
బాన్సువాడలో..
ఇక అదే జిల్లా బాన్సువాడలోని ఒక సూపర్ మార్కెట్‌లో ఒక మతానికి చెందిన పాట పెట్టడంపై మరో మతానికి చెందిన వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. దాంతో అక్కడ వివాదం చెలరేగింది. ఈ వాగ్వాదం పెద్దది కావడంతో.. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వారిపై ఒక వర్గం వారు రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఇక్కడ కూడా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కాగా ఒక వర్గానికి మద్ధతుగా బీజేపీ నేతలు బాన్సువాడ వెళ్లే ప్రయత్నం చేయగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
రెండవరోజు అదే ఉద్రిక్తత
కాగా ఆదివారం కామారెడ్డి(kamareddy) లో పర్యటిస్తామని బీజేపీ రాష్ర్ట నేతలు ప్రకటించడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి వెళ్లడానికి ప్రయత్నించిన బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్ రావును హౌజ్ అరెస్ట్ చేశారు. అలాగే బాన్సువాడ వెళ్లడానికి ప్రయత్నించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(goshamahal mla raja singh) ను మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కామారెడ్డిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.ఇతరులు ఎవరూ కామారెడ్డికి రాకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు.
Follow Us