మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ సంచలన కామెంట్స్ చేశారు. త్వరలో పార్టీ పెట్టబోతున్న ఆమె మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. తమ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి(trs) అనే పేరు పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నట్లు ఆమె తెలిపారు. అయితే ఈసారి పార్టీ జెండాలో పింక్ కలర్ మాత్రం ఉండదని స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం రోజున అమరవీరుల స్తూపాన్ని సందర్శిస్తామని, వేదికపై కేవలం ఉద్యమకారులే ఉంటారని ఆమె స్పష్టం చేశారు.
పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఇప్పటికే ఒక ప్రత్యేక టీమ్ రంగంలోకి దిగిందని వెల్లడించారు.ఇక తమ పార్టీలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ సిద్ధాంతాలే ప్రాధాన్యమని కవిత(kalvakuntla-kavitha) చెప్పుకొచ్చారు. తమ ప్రధాన పోరాటం కాంగ్రెస్ పార్టీతోనేని కవిత తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారం కాంగ్రెస్‌ను ఓడించినట్టే, ఇప్పుడు కేరళలో కూడా అదే పని చేస్తారని ఎద్దేవా చేశారు. కేరళలో ఆరు గ్యారంటీల గురించి సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె నవ్వుతూ కొట్టిపారేశారు. ఏపీలో అమరావతి ఉన్నా లేకున్నా తమకు అనవసరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో ఉన్న సిటీని పాడు చేయకుంటే చాలని తెలిపారు. తమ పార్టీ దృష్టి అంతా తెలంగాణ ప్రయోజనాలపైనే చెప్పుకొచ్చారు.
Also Read : గ్రూప్-1 నియామకాలు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
గజ్వేల్ నుంచి పోటీ చేసే ఆలోచనలో
మహిళా రిజర్వేషన్లు వస్తే సిద్దిపేట లేదా గజ్వేల్ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కవిత వెల్లడించారు. నిజామాబాద్‌లో కూడా చాలా సీట్లు మహిళా కోటాలోకి వస్తాయన్నారు. డీఎస్పీ విశారదన్ మహరాజ్ గారితో కలిసి ముందుకు సాగుతామని వెల్లడించారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కష్టపడి టీఆర్ఎస్‌ను అధికారంలోకి తెచ్చారని ... అదే స్ఫూర్తితో తాను జాగృతి కోసం కష్టపడుతున్నాని వెల్లడించారు. హార్డ్ వర్క్‌లో చంద్రబాబు సూపర్, టీడీపీకి బలమైన పార్టీ నిర్మాణం ఉందని ఆమె వెల్లడించారు.
తనపై ఉన్న లిక్కర్ కేసు కొట్టేయడంపై స్పందిస్తూ.. ప్రకృతి తనకు సహకరిస్తోందని ఆమె భావించారు. ఎంత తెలివైన వాడినైనా అపొచ్చు కానీ, అదృష్టవంతుడిని ఎవరూ ఆపలేరు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్.... 21 వస్తువులతో స్పెషల్ కిట్
Kalvakuntla kavitha : టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెడతా.. కవిత సంచలనం!
మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ సంచలన కామెంట్స్ చేశారు. త్వరలో పార్టీ పెట్టబోతున్న ఆమె మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. తమ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నట్లు ఆమె తెలిపారు.