KA Paul: నేనే అల్లు అర్జున్‌ని అయితే రూ.300 కోట్లు ఇస్తా

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఈ కేసులో అల్లు అర్జున్ ఇప్పటికే బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ప్రకటించారు. అందులో తొలివిడతగా రూ.10 లక్షల్ని అందించారు. ఈక్రమంలో కేఏపాల్‌ అల్లు అర్జున్‌ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
KA Paul: ఈ ఎన్నికలు ఈవీఎంల మాయ.. కేఏ పాల్ సెన్సేషనల్ కామెంట్స్..!

ka paul comments on allu arjun

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట  ఘటనతో అల్లు అర్జున్‌పై విమర్శల దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తొక్కిసలాటలో చనిపోయిన బాధిత కుటుంబానికి రూ.50 లక్షల చెక్‌ను ఇచ్చారు ‘పుష్ప 2’ చిత్ర నిర్మాతలు. అయితే ఈ ఘటనపై స్పందించిన కేఏ పాల్.. పాతిక లక్షలు, యాభై లక్షలు కాదు.. రూ.300 కోట్లు ఆ కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏంటీ మూడొందల కోట్లే అని మీడియా మిత్రులు ఆశ్చర్యపోవడంతో.. అవునూ మూడొందల కోట్లే.. నేనే అల్లు అర్జున్‌ని అయితే.. ఆ మూడొందల కోట్లే కాదు.. మొత్తం వేల కోట్ల ఆస్తిని పంచేసేవాడిని అంటూ ఎప్పటిలాగే ఆయన తన నోటికి పనిచెప్పారు. 

Also Read: 🔴 Allu Arjun Case Live Updates: మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ విచారణ

ఈ సందర్భంలో కేఏ పాల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు . రేవంత్ రెడ్డే స్వయంగా చెప్పారు. నేను అబద్దాలే మాట్లాడతా.. ప్రజలు అబద్దాలే నమ్ముతారని. ఆయన తాజాగా అసెంబ్లీలో ఏం మాట్లాడారో. . మీరూ విన్నారు. నేనూ విన్నాను. అందులో కొన్ని సత్యాలు ఉండొచ్చు. కొన్ని అసత్యాలు ఉండొచ్చు. కానీ ఆ తరువాత అల్లు అర్జున్ ఎలా మాట్లాడారూ.. మీడియా ముందు నటించారు.

 

అదే నేనే అల్లు అర్జున్ అయితే కనుక.. చనిపోయిన రేవతి అనే మహిళకి లక్ష కోట్లు ఇచ్చినా నేను తిరిగి తీసుకుని రాలేను. అందుకు నన్ను క్షమించాలి. దయచేసి రేవతి భర్త, రేవతి బంధువులు నన్ను క్షమించండి అని ముందు మాట మాట్లాడాలి.నేనే అల్లు అర్జున్‌ని అయితే కనుక.. ఆ సినిమాకి నాకు రూ.300 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారు కాబట్టి రేవతి కుటుంబానికి, హాస్పిటల్‌లో ఉన్న ఆమె కొడుక్కి ఆ మూడొందల కోట్లు ఇచ్చేస్తున్నా అని ప్రకటించేవాడ్ని.

Also Read: Zelensky: 3000 మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు చనిపోయి ఉండొచ్చు!

20 సినిమాలు చేశాను.. ఇంకో ఇరవై చేసి సంపాదించుకుంటాను. ఇప్పటివరకూ సంపాదించిన డబ్బు అంతా పేదలకు పంచేస్తాను. గ్రామాలను అభివృద్ది చేస్తాను అని అనాలి. కానీ అల్లు అర్జున్ అలా మాట్లాడలేదు.నేను వచ్చిందే ఎంటర్‌టైన్మెంట్‌కి నేను చేసిందే మీకొరకు అని అంటాడేంటి? అతనికి వేల కోట్లు ఉన్నాయి. మైహోమ్స్‌లో నీకు భాగస్వామ్యం ఉంది కదా.

Also Read: TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం గంట నుంచి 3 గంటల్లోపే

మైహోమ్స్ అధినేతకి లక్షల కోట్లు ఉంటే.. అల్లు అర్జున్‌కి వేల కోట్లు ఉన్నాయి. రూ.25 లక్షలు ఇస్తానని చెప్పి.. రూ.10 లక్షలు ఇవ్వడం ఏంటి ? కేఏ పాల్ అనే నేను.. ఐదు లక్షల కోట్లు ఇచ్చాను. ప్రపంచ వ్యాప్తంగా. లక్షలాది గృహాలను నిర్మించా నా సొంతడబ్బుతో. నేను ఇంత చేస్తుంటే అల్లు అర్జున్ ఎందుకు చేయడంటూ తనదైన శైలిలో మాట్లాడి మీటింగ్‌ ముగించేశారు పాల్‌. 

Also Read: AP Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు!kap

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు