Betting Apps Case: సెలబ్రిటీలకు 72 గంటలే టైం.. సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్!

బెట్టింగ్ యాప్స్‌పై కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్స్.. డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనవని అన్నారు. ప్రతి ఇంట్లో అరచేతిలో ఉండే ఫోన్లోనే లభిస్తాయని తెలిపారు. 72గంటల్లోగా సెలబ్రిటీలు క్షమాపణ చెప్పాలన్నారు.

New Update
KA Paul files PIL in Supreme Court against betting apps

KA Paul files PIL in Supreme Court against betting apps

తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం రచ్చకెక్కింది. ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో.. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ సెలబ్రిటీల పై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. అందులో కొందరిని విచారిస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ, జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి వంటి వారిని విచారణ చేశారు. ఈ క్రమంలో ప్రజల సమస్యలపై గొంతెత్తే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై మాట్లాడారు. 

సుప్రీంకోర్టులో పిల్

ఇందులో భాగంగానే ఆయన మనీ గేమింగ్ - బెట్టింగ్ యాప్స్‌పై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్స్.. డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనవి అని అన్నారు. ఇవి ప్రతి ఇంట్లో అరచేతిలో ఉండే ఫోన్లోనే లభిస్తాయని అన్నారు. తెలంగాణలో యాప్స్ పై బ్యాన్ ఉన్నప్పటికీ 978 మంది చనిపోయినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Also Read: యూట్యూబర్‌ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం!

క్రీడాకారులు, సినీ నటులను యువత రోల్ మోడల్‌గా తీసుకుని.. వారంతా సైతాన్లుగా మారారన్నారు. ఇందులో భాగంగానే పరోక్షంగా ఇంత మంది చావులకు కారణమయ్యారు అని తెలిపారు. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా రూ. 7 - 14వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వాలు మిన్నకున్నాయని ఆరోపించారు.

Also Read: వైలెన్స్, లవ్, యాక్షన్, డ్రామా.. సల్మాన్ ఖాన్ 'సికందర్' ట్రైలర్ భలే ఉంది!

అంతకంటే ఎక్కువ నిధులు తాను తెచ్చి పెడతానని.. అన్ని మనీ గేమింగ్ యాప్స్‌ను తక్షణమే బ్యాన్ చేయాలని తెలిపారు. 72 గంటల్లోగా సెలబ్రిటీలు ముందుకొచ్చి క్షమాపణ చెప్పాలని.. నష్టపోయినవారికి పరిహారం ఇప్పించాలి అని కోరారు. ఈ మేరకు సెలబ్రిటీలు ఎవరినీ వదిలిపెట్టనని అన్నారు. ఇది బెదిరింపు కాదని.. ఈడ్చుకెళ్తానని చెప్పుకొచ్చారు.

( betting apps case | betting-apps | latest-telugu-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment