Telangana: విద్యార్ధుల మొబైల్ కే హాల్ టికెట్లు..

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బోర్డు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు వారి మొబల్ నంబర్లకే రానున్నాయి. మరోవైపు ఈరోజు నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి. 

New Update
TS Inter Exams: ఇవాళ్టి నుంచి ఇంటర్‌ పరీక్షలు స్టార్ట్.. ఆ పొరపాటు చేయవద్దు!

ఇంతకు ముందు వరకూ కాలేజీకి వెళ్ళి ఇంటర్ హాల్ టికెట్లను తీసుకొచ్చేవారు. లేదా వెబ్ సైట్లో పెట్టి డౌన్ లోడ్ చేసుకోమని చెప్పేవారు.  కానీ ఇప్పుడు హాల్ టికెట్లను విద్యార్థుల మొబైల్ నంబర్లకే పంపిస్తోంది బోర్డు. విద్యార్థులు ఇచ్చిన మొబైల్‌ ఫోన్‌ నంబర్లకు లింక్‌ పంపిస్తున్నారు. దాన్ని క్లిక్‌ చేస్తే హాల్‌టికెట్‌ వస్తుందని, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారి ఒకరు తెలిపారు.  

Also Read: Parliament Session: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు..ఈరోజు అఖిలపక్షం సమావేశం

పరీక్షల సీజన్ మొదలైంది..

మరోవైపు ఈరోజు నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు మొదలయ్యాయి. మొదట ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. తరువాత అసలు పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఇప్పటికే విద్యార్థుల మొబైల్ కు పంపించామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు మొదలవనున్నాయి. వారికి కూడా త్వరలోనే హాల్ టికెట్లను పంపిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. 

Also Read: USA: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌ షాక్.. మూడు కేసులు నమోదు!

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది.  శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్‌ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్‌ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.  

New Update
mla-rajasingh cases

mla-rajasingh cases

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్‌షాక్ తగిలింది.  శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్‌ వ్యాఖ్యలపై పోలీసుల చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్‌ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.  శోభాయాత్రలో రాజాసింగ్‌ మాట్లాడుతూ ఉండగా.. భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం వద్దకు తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతూ.. భక్తులు, కార్యకర్తలపై లాఠీలు ఝులిపించారు. ఈ క్రమంలో  భక్తులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝులిపిస్తే..లాఠీలకు మేమూ పని చెప్తామంటూ రాజాసింగ్‌ కామెంట్స్ చేశారు. అయితే రాజాసింగ్ వ్యాఖ్యలపై పోలీసుల సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.  

ఇక ఇదే శోభాయాత్రలో ఓవైసీ బ్రదర్స్‌పై రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒవైసీ బ్రదర్స్‌ను... కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ముస్లింలను ఒవైసీ సోదరులు మోసం చేస్తున్నారంటూ రాజాసింగ్ మండిపడ్డారు.  ఒవైసీ బ్రదర్స్ ముస్లింల ఆస్తులను దోచుకున్నారని.. వారి అరుపులకు ఎవరు భయపడరంటూ రాజాసింగ్‌ కీలక కామెంట్స్ చేశారు.

ముస్లింలకు వ్యతిరేకం కాదు

వక్ఫ్ బోర్డ్ పేరుతో ఒవైసీ బ్రదర్స్‌ ఎన్నో భూములు కబ్జాకు గురయ్యాయని రాజాసింగ్ అన్నారు. బోర్డు రాకముందు 4 వేల ఎకరాలుంటే.. బోర్డును అడ్డం పెట్టుకుని  9లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఇక వక్ఫ్ బోర్డ్ ముస్లింలకు వ్యతిరేకం కాదని.. వారి ఆస్తులకు మోడీ రక్షణ కల్పిస్తారని చెప్పారు.  ప్రస్తుతం ఇది మోడీ భారత్ అని అన్నారు. 

Also Read : Tamilisai Soundararajan : తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!

Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

Advertisment
Advertisment
Advertisment