/rtv/media/media_files/2025/03/22/LRDCOyGBPSPId3CbFElc.jpg)
Bandi sanjay
కేంద్రమంత్రి బండి సంజయ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఇండిగో విమానం బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బండి సంజయ్ ఇండిగో విమానంలో బయలుదేరారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల హైదరాబాద్‌లో ల్యాండ్ చేయడం కుదరలేదు. దీంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు.
Also Read: నేడు వరల్డ్ ఎర్త్ అవర్ డే.. రాత్రి 8.30 నుంచి 9.30 మర్చిపోవద్దు
అర్ధరాత్రి 2.45 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరిన విమానం హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బండి సంజయ్ నేరుగా కరీంనగర్‌కు వెళ్లారు. శనివారం కరీంనగర్, జమ్మికుంటలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
Also Read: లండన్ ఎయిర్ పోర్టులో మంటలు 1350 విమానాలకు అంతరాయం!
ఇదిలాఉండగా తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో వండగండ్లు కూడా పడ్డాయి. ముఖ్యంగా.. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోనే ఈ అకాల వర్షాలు కురవటం గమనార్హం. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్లు పడ్డాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో వడగండ్లు పడ్డాయి. ధర్మపురి మండలంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది నేరేళ్ల, తుమ్మేనాల, ధర్మపురి, తిమ్మాపూర్‌తో పాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Also Read: ఇండియాలో ఏ రాష్ట్రం మంచిదో చెప్పిన సర్వే.. కేరళ ఫస్ట్, పంజాబ్ లాస్ట్
Bandi Sanjay | telugu-news | rains | emergency-landing | indigo-flight-emergency-landing