/rtv/media/media_files/2025/01/13/zDHeuVJnDmiIqbTS0AAw.jpg)
fog telangana
Telangana: తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్‌కు టెంపరేచర్లు పడిపోతున్నాయి. సంక్రాంతికి చంపేంత చలి ఉంటుందని పెద్దలు అంటుంటారు. అందుకు తగ్గుట్లుగానే.. సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా చలి గాలుల ప్రభావం తీవ్రంగా పెరిగింది. ఉదయం, రాత్రి వేళల్లో టెంపరేచర్లు భారీగా పడిపోతున్నాయి. మరో మూడు రోజుల పాటు తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు.
Also Read: Maha Kumbh: కుంభమేళా ఎఫెక్ట్.. విమాన టికెట్ ధరలు చుక్కల్లోనే
ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. తూర్పు, ఆగ్నేయ దిశలో వీస్తున్న గాలుల ప్రభావంతో చలి మరింత పెరిగింది. కొమురం భీం అసిఫాబాద్, అదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో టెంపరేచర్లు గణనీయంగా పెరిగాయి. చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Also Read: కుంభమేళలో ఈ బ్యూటీ సాధ్వి కాదు.. ఎవరీ హర్ష రిచారియా..?
మెదక్, హైదరాబాద్, సంగారెడ్డి నగర శివారు ప్రాంతాల్లోనూ చలి ఎక్కువగా ఉంటోంది. రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు ఇదే వాతావరణం ఉండే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు హెచ్చరికలు కూడా జారీ చేశారు.
రానున్న మూడ్రోజులు..
అంతే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడ్రోజులు ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. పొగమంచు కారణంగా ఉదయం వేళ రహదారులు కనిపించడం లేదు.
ఎదురుగా ఎవరొస్తున్నారన్నది తెలియడం లేదు. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండి వాహనాలు నడపాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం, రాత్రి పూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పడుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు కూడా దాటడం లేదు. ఉదయం 8 దాటినా పొగమంచు కారణంగా రోడ్లు కనిపించకపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక చలి గాలుల ప్రభావం పెరగటంతో ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీలు, బాలింతలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో శ్వాసకోస సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చలి నుంచి రక్షణ పొందే దుస్తులు వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణాలు మానుకోవాలని అంటున్నారు. వేడి వేడి ఆహారం తీసుకోవాలని.. గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగాలని సూచిస్తున్నారు.
Also Read: చిట్టి చిట్టి రోబో.. ఇండియన్ ఆర్మీలో రోబోటిక్ డాగ్స్
Also Read: Planet Parade: ఫిబ్రవరి 28న ఆకాశంలో అద్భుతం..ఒకే లైన్ లోకి 7 గ్రహాలు!