Telangana Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం

తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతుంది.నిన్న సాయంత్రం నుంచి పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. తెల్లవారుజామున కూడా అల్వాల్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బషీర్ బాగ్ తో పాటుగా ఆనేక ఏరియాల్లో వర్షం పడుతోంది.

New Update
Rains

Rains

తెలంగాణలో వర్షాలు(Telangana Rains) పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌(hyderabad)లో వర్షం దంచికొడుతుంది. నిన్న సాయంత్రం మొదలైన వర్షం తెల్లవారుజామున కూడా పలు ప్రాంతాల్లో కుండపోతగా కురిసింది. అల్వాల్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బషీర్ బాగ్ తో పాటుగా ఆనేక ఏరియాల్లో వర్షం పడుతోంది. 

హస్తినాపురంలో అత్యధికంగా 17.5 మి.మి వర్షం కురువగా..  సులేమాన్ నగర్‌లో 14.5 మి.మి. వాన,  అత్తాపూర్‌లో 13.5 మి.మి వర్షపాతం, వనస్థలిపురం, రాజేంద్రనగర్లో 12మి.మి వర్షం పడింది.  రాబోయే మరికొన్ని గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతుంది. వర్షం కారణంగా చాలా ఏరియాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

Also Read :  మార్చి 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. 20న రాష్ట్ర బడ్జెట్!

17 జిల్లాలకు ఎల్లో అలర్ట్

కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి.హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 నుంచి 3 గంటల్లో వర్షం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

దాదాపు 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, మెడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. వచ్చే రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎండలు క్రమంగా పెరగవచ్చు. - imd

Also Read :  ప్రముఖ వైద్యుడు ముళ్లపూడి వెంకటరత్నం కన్నుమూత

Advertisment
తాజా కథనాలు