Honk More Wait More: హారన్‌ మోగిస్తే ఇక అంతే సంగతులు..సౌండ్ తగ్గితేనే గ్రీన్‌సిగ్నల్‌

రాజధాని హైదరాబాద్‌ నగరంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన వాహనాలతో ఇటీవల సౌండ్ పొల్యూషన్ పెరిగిపోయింది. దీన్ని అరికట్టేందుకు వినూత్న పద్ధతిలో చర్యలు చేపట్టేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది.

New Update
FotoJet - 2025-12-08T075541.404

Honk More Wait More: రాజధాని హైదరాబాద్‌ నగరంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన వాహనాలతో ఇటీవల సౌండ్ పొల్యూషన్ పెరిగిపోయింది. దీన్ని అరికట్టేందుకు వినూత్న పద్ధతిలో చర్యలు చేపట్టేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది. ప్రధానంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అదే పనిగా వాహనదారులు హారన్ శబ్దం చేస్తే రెడ్ సిగ్నల్ నిర్ణీత సమయం గడిచినా మారదు. గ్రీన్‌సిగ్నల్‌ పడడం మరింత ఆలస్యమవుతుంది. దీంతో వాహనదారులు త్వరగా సిగ్నల్ క్రాస్ చేసి గమ్యస్థానం చేరాలంటే హారన్ కొట్టడం మానేయాల్సి ఉంటుంది. ముంబై, బెంగుళూరులో ప్రవేశపెట్టిన ఈ విధానం మంచి ఫలితాలను ఇచ్చింది. వాహనాల ద్వారా వెలువడే శబ్దాలు గణనీయంగా తగ్గాయి. దీంతో హైదరాబాద్‌లోనూ ఇదే విధానాన్ని  అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. ఈ విధానానికి హాంక్ మోర్ వెయిట్ మోర్ అని పేరుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఎక్కువసేపు హారన్ కొడితే ఎక్కువ సేపు ఆగాలనేదే దీని అర్థం. - pollution-control-board

2020లో ముంబైలో ఈ విధానాన్ని అక్కడి పోలీసులు అమల్లోకి తెచ్చారు. దీంతో ముంబైలో రద్దీ జంక్షన్‌లలో హారన్ ఉపయోగించడం 60 శాతం తగ్గింది. దీంతో బెంగుళూరు ట్రాఫిక్ పోలీసులు కూడా ఇదే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అక్కడ కూడా హారన్ సౌండ్స్ తగ్గిపోయాయి.  ఈ రెండు నగరాల్లో మంచి ఫలితాలు రావడంతో  ఈ విధానం పాపులర్ అయింది.  ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్రత్యేక సౌండ్ సెన్సార్లను ఏర్పాటు చేస్తారు. రెడ్ సిగ్నల్స్ పడగానే ఎవరైనా వాహనదారులు అనవసరంగా అధికంగా హారన్ మోగిస్తే  అది శబ్దతీవ్రత పరిమితికి మించితే ఆటోమెటిక్‌గా రెడ్ సిగ్నల్ సమయం దానంతట అదే ఎక్కువ సెకన్లకు పెరుగుతుంది. శబ్ద తీవ్రత తగ్గితేనే తిరిగి గ్రీన్ సిగ్నల్ పడుతుంది. 

Also Read :  ఖర్చు తక్కువ.. పవర్ ఎక్కువ.. ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్!

సిటీలో భారీగా పెరిగిన సౌండ్ పొల్యూషన్‌ 

హైదరాబాద్‌లో శబ్ద కాలుష్యం(hyderbad air pollution) పెరిగింది. నివాస ప్రాంతాల్లో  55 డెసిబుల్స్ కంటే ఎక్కువ సౌండ్ ఉండొద్దన్న రూల్స్‌ ఉన్నాయి. అది మించితే ప్రమాదమని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. ఉదయం పూట 55 డెసిబుల్స్, రాత్రి పూట 40 డెసిబుల్స్ మాత్రమే సౌండ్స్ ఉండాలి. కమర్షియల్ సెంటర్లలో  మార్నింగ్ 65, రాత్రి 55  డెసిబుల్స్ మించవద్దనేది నిబంధన. ఇక పరిశ్రమలున్న ప్రాంతాల్లో ఉదయం 65, రాత్రి 55 డెసిబుల్స్ కంటే సౌండ్ రావద్దు. కానీ, ఈ పరిమితి దాటినట్టు పీసీబీ గణాంకాలు చెబుతున్నాయి.  గచ్చిబౌలి, పైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ప్యారడైజ్ వంటి రద్దీ కూడళ్లలో ఇది 110 డెసిబుల్స్  దాటుతోంది.  

వాహనాల సంఖ్య పెరగడంతోనే..

2019 నుంచి 2025 మధ్య వాహనాల సంఖ్య 50 శాతం పెరిగాయి.  ఇది కూడా శబ్ద కాలుష్యానికి కారణమైంది. వాహనాలకు సైలెన్సర్లను మార్చి నడపడం కూడా సౌండ్ తీవ్రతమను పెంచుతోంది. కొందరు యువకులు సైలెన్సర్లను తీసి వాహనాలు నడుతుంటారు. ఇలాంటివి సౌండ్ పొల్యూషన్ ను మరింత తీవ్రం చేస్తున్నాయి.  హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. భవనాల నిర్మాణంతో కూడా సౌండ్ పెరుగుతోంది. ఇక పబ్ ల్లో సౌండ్  పరిమితికి మించి ఉంటుందని గతంలో కొందరు హైదరాబాద్ వాసులు హైకోర్టును ఆశ్రయించారు. పరిశ్రమలు, చిన్న స్పీకర్లు ఉపయోగించి కూరగాయలు లేదా ఇతర వస్తువులు, సరుకుల విక్రయం వంటివి కూడా సౌండ్ పొల్యూషన్ పెరగానికి కారణమేనని అధికారులు చెబుతున్నారు. 

మనిషి ప్రాణాలకే ముప్పు...

శబ్ద కాలుష్యం మనిషి ఆరోగ్యానికి నష్టమే. కొన్ని సమయాల్లో  మనిషి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. డీజే సౌండ్ కు గుండెపోటుతో మరణించిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. సౌండ్ పొల్యూషన్ తో వినికిడి లోపం, ఒత్తిడి, రక్తపోటు, చిరాకు, మానసిక సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీపావళి, దసరా, న్యూఇయర్ లేదా ఇతర వేడుకలు,  పార్టీల బహిరంగ సభలు నిర్వహించిన సమయంలో  సౌండ్ పొల్యూషన్ పెరుగుతోంది.  

Also Read :  6 ఖండాలు, 44 దేశాలు, 154 మంది ప్రతినిధులు.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం

Advertisment
తాజా కథనాలు