/rtv/media/media_files/2025/02/10/ruUDwpMjqQVhhDRgYGtC.webp)
Telangana High Court
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి 15వ వార్డు కౌన్సిలర్ భర్త నాగవెల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు పట్టణంలోని రెడ్డి కాలనీలో అదును చూసి కత్తులతో విచక్షణారహితంగా పొడవడంతో రాజలింగమూర్తి కుప్పకూలిపోయాడు. కొద్దిసేపు మృత్యువుతో పోరాడి తనువు చాలించాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై కేసీఆర్, మాజీ మంత్రులతో పాటు సదరు గుత్తేదారు కంపెనీలపై రాజలింగమూర్తి కేసు నమోదు చేయడం ద్వారా వెలుగులోకి వచ్చారు.
అతనే లేరు...విచారణ ఎలా..
నిన్న రాజ లింగమూర్తి వేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే ప్రస్తుతం అతను చనిపోయినందున అతను వేసిన పిటిషన్ కు అర్హత లేదని కోర్టు చెప్పింది. ఫిర్యాదుదారుడు చనిపోయినప్పుడు కోర్టు ఎవరిని విచారించాలి, ఎవరి స్టేట్ మెంట్ ఆధారంగా విచారణ చేయాలో చెప్పాలని ప్రశ్నించింది. సరే ఫిర్యాదు ద్వారా విచారణ చేపట్టినా...అందులో అంశాల మీద ఎవరు వాంగ్మూలం ఇస్తారని అడిగింది. ఫిర్యాదుదారు చనిపోయినా విచారణ జరపవచ్చని, గడువు ఇస్తే వాదనలు వినిపిస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు కోరడంతో విచారణను కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది.
మేడిగడ్డ కుంగుబాటుపై రాజలింగమూర్తి భూపాలపల్లి మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దానిని ఆ కోర్టు కొట్టివేసింది. దానిపై రివిజన్ ఫిర్యాదును విచారణ చేయాలని జయశంకర్ భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి నిర్ణయం తీసుకున్నారు. దీంతో కేసీఆర్, హరీశ్ రావుకు నోటీసులు పంపించారు. అయితే వీటిని కేసీఆర్, హరీశ్ రావు ఇద్దరూ హైకోర్టులో సవాల్ చేశారు. దానిపైనే హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ నిన్న విచారించారు. అయితే దీనిపై ఫిర్యాదుదారుడు చనిపోయినా విచారణ చేయవచ్చని..గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.30 లక్షల కోట్లు దుర్వినియోగం చేసిందని చెప్పడానికి మేడిగడ్డ కుంగుబాటే నిలువెత్తు సాక్ష్యమని పీపీ అన్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఎలాంటి నివేదిక సమర్పించలేనప్పుడు విచారణ కొనసాగింపు ఎలా చేపట్టాలో చెప్పాలని జడ్జి అడిగారు. పీపీ చెప్పిన సమాధానాలకు ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: Mumbai: వార్ధా సామూహిక అత్యాచారం కేసులో..8 మంది నిర్దోషులుగా హైకోర్టు ప్రకటన
Bandi Sanjay : ఎమ్మెల్సీ ఎన్నికలపై బండి సంజయ్ సంచలన కామెంట్స్
తెలంగాణలో రబ్బర్ స్టాంప్ పాలన నడుస్తోందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన బ్రష్టు పట్టిందన్నారు. ఢిల్లీ టెన్ జన్ పథ్ నుంచి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు.
Bandi Sanjay Vs KCR
తెలంగాణలో రబ్బర్ స్టాంప్ పాలన నడుస్తోందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన బ్రష్టు పట్టిందన్నారు. ఢిల్లీ టెన్ జన్ పథ్ నుంచి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ గాలికి వదిలేసిందని విమర్శించారు. సీఎం రేవంత్ కు, మంత్రులకు అసలు పాలనపై పట్టులేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రతి పనికి కమిషన్లు, అవినీతి నడుస్తోందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక కామెంట్స్
ఇక ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు. దేశద్రోహులు, దేశభక్తుల మధ్య హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఎంఐఎం గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ సహకరిస్తున్నాయని అన్నారు. మజ్లిస్ కంబధ హస్తల నుంచి హైదరాబాద్ ను కాపాడుతామని తెలిపారు సంజయ్. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని.. కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ కేసుల నుంచి కాపాడుతుందని ఆరోపించారు.
ఇది కూడా చూడండి: వాట్సాప్ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
శ్రీలీలను ఎలా లాగేసుకున్నాడో చూడండి.. అంతా షాక్! వీడియో వైరల్
BRS: బీఆర్ఎస్కు షాక్.. ఆ సభ డౌటే....?
Allu Arjun-Atlee: అల్లు అర్జున్ హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ.. అట్లీ సినిమాపై అదిరే అప్డేట్
Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం
రాములోరి సేవలో బీఆర్ నాయుడు | TTD Chairman BR Naidu In Bhadrachalam | Ramayya Kalyanam | RTV