/rtv/media/media_files/2025/01/28/Ml1ABYaL4Rxn0TnUOcWo.webp)
Hydraa Demolitions
Aminpur : హైడ్రా (Hydra) కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ పద్మావతి లే అవుట్‌లో మంగళవారం అధికారులు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కి చెందిన ఫెన్సింగ్‌ను తొలగించారు. ప్రహారీ గోడను గతంలో అధికారులు కూల్చివేశారు. అయితే తిరిగి మరోసారి అక్కడ ఫెన్సింగ్‌ను నిర్మించారు. దీనిపై ఐలాపూర్ రాజగోపాల్ నగర్, బందంకొమ్ము ప్రాంతాల్లో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు మరోసారి ఫెన్సింగ్‌ను కూల్చివేశారు. అలాగే వందనపురి కాలనీలో మరికొన్ని నిర్మాణాలను కూల్చివేశారు. కాగా, అమీన్‌పూర్ పెద్ద చెరువును ఆనుకుని ఉన్న పద్మావతి నగర్ లే ఆవుట్..193, 194, 323 సర్వే నెంబర్లలో 24 ఎకరాల్లో విస్తరించి ఉన్న లే అవుట్ కబ్జాకు గురైందని బాధితులు గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ పలుకుబడితో చుట్టూ ప్రహరీ నిర్మించారని భాదితులు ఆరోపిస్తున్నారు.
Also Read: నా భార్య కొడుతుంది.. నన్ను క్షమించు నాన్న: భార్య వేధింపులకు మరో భర్త బలి!
సుమారుగా 2006 నుంచి ఈ అంశం పై పోరాడుతున్నామని తెలిపారు. మొత్తం 294 ప్లాట్స్ తో ఏర్పాటు చేసిన పద్మావతి నగర్ లే అవుట్ విషయంపై నాలుగు నెలల క్రితం బాధితులు మొదటగా హైడ్రాను ఆశ్రయించకారు. సర్వే చేసి మూడు నెలల క్రితం చుట్టూ నిర్మించిన గోడను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే కూల్చివేతల తర్వాత కబ్జాదారులు కొద్ది రోజులకే ఐరన్ ఫెన్సింగ్ వేశారు. దీంతో మరోసారి బాధితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హైడ్రా మళ్లీ కూల్చివేతల పనులను చేపట్టింది.
Hydraa Demolitions Aminpur
Also read: 'గంగా నదిలో మునిగితే పేదరికం పోతుందా, మోదీ, అమిత్ నరకానికే పోతారు': మల్లికార్జున ఖర్గే
అమీన్ పూర్ (Aminpur) పెద్ద చెరువుకు అనుకుని ఉన్న పద్మావతి నగర్ లేఅవుట్ ఆక్రమణకు గురైంది. 193, 194, 323 సర్వే నెంబర్లో 24 ఎకరాల్లో పద్మావతి లే అవుట్ విస్తరించి ఉంది. రాజకీయ పలుకుబడితో లే అవుట్‌ను కబ్జా చేసి చుట్టూ ప్రహరీ నిర్మించారు కబ్జా దారులు. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, అతని అనుచరులు కబ్జాకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. సుమారుగా 2006 నుంచి ఈ అంశంపై బాధితులు పోరాడుతున్నారు. ఏళ్లుగా స్థానికంగా ఎవరు పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. మొత్తం 294 ప్లాట్స్‌తో పద్మావతి నగర్ లే అవుట్ ఏర్పాటు చేశారు. గత నాలుగు నెలల క్రితం మొదటగా హైడ్రాను బాధితులు ఆశ్రయించారు. సర్వే చేసి మూడు నెలల క్రితం చుట్టూ నిర్మించిన గోడను హైడ్రా కూల్చివేసింది. అయితే హైడ్రా కూల్చివేసిన తరువాత కొద్ది రోజులకే కబ్జాదారులు ఐరన్ ఫెన్సింగ్ వేశారు. దీనిపై మరోసారి హైడ్రా ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది.
Also Read: మధ్యాహ్న భోజన పథకంపై.. విద్యా కమిషన్ కీలక నివేదిక
Also Read : మల్టీలెవల్ మార్కెటింగ్ మాయలో పడొద్దు.. పోలీసులు కీలక విజ్ఞప్తి