HYD: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు

ఎవరెంత గోల పెట్టినా...హైకోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా హైడ్రా మాత్రం తగ్గేదే ల్యా అంటోంది. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను వరుసపెట్టి కూల్చేస్తోంది. తాజాగా మాదాపూర్‌‌లో అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మిస్తున్న బిల్డింగ్‌ను కూల్చేశారు హైడ్రా అధికారులు. 

author-image
By Manogna alamuru
New Update
madhapur

Hydra demolition

తెలంగాణలో హైడ్రా తన పనులు తాను చేసుకుంటూ పోతోంది. గవర్నమెంట్ అండతో హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది. ఈరోజు మాదాపూర్‌ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అక్కడ అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మిస్తున్న బిల్డింగ్ కూల్చేశారు హైడ్రా అధికారులు. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను ప‌ట్టించుకోకుండా నిర్మిస్తున్న బిల్డింగ్ ను కూల్చేశామని హైడ్రా అధికారులు చెప్పారు. 

ఇది కూడా చదవండి: Bhopal: 5లక్షల మందిని మింగిన భోపాల్ గ్యాస్ ఫ్యాక్టరీ.. 40ఏళ్ల తర్వాత ఎందుకు తెరిచారంటే?

రూల్స్ ప్రకారం లేదు..

రూల్స్ పట్టించుకోకుండా ఉన్న ఏ నిర్మాణాన్నైనా కూల్చేస్తామని హైడ్రా అధికారులు ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. అయినా కూడా కొంతమంది వాటిని పెడ చెవిన పెడుతున్నారు. ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో నిర్మించిన భవం కూడా రూల్స్‌ను అతిక్రమించి కట్టినదే. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్, గ్రౌండ్ తో పాటూ 5 అంతస్తు భవనాన్ని నిర్మిస్తున్నారని అక్కడ స్థానికులు హైడ్రాకు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదుల మేరకు బిల్డింగ్‌ను పరిశీలించిన  అధికారులు దాన్ని కూలగొట్టారు. అక్ర‌మ క‌ట్ట‌డమ‌ని హైకోర్టు నిర్ధారించినప్పటికీ.. కోర్టు ఉత్త‌ర్వుల‌ను ప‌ట్టించుకోకుండా భ‌వ‌నాన్ని నిర్మిస్తున్నట్లు గుర్తించామన్నారు హైడ్రా  కమిషనర్ రంగనాథ్. హైకోర్టు ఆర్డ‌ర్ ఆధారంగా గతేడాది మార్చ్ లో బిల్డింగ్ కొంతభాగాన్ని కూల్చేశామని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు.

 Also Read: ప్రతి సోమవారం హైడ్రా ప్రజావాణి.. ఈ నంబర్లకు కాల్ చేయండి!

 


 

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

New Update
Rains

Rains

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment