/rtv/media/media_files/2025/03/27/5fclgMkQES1RzJQLXFPN.jpg)
Hydra demolition
HYDRAA : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ని అల్మాస్‌గూడలో హైడ్రా బుల్డోజర్లు దూకుడు పెంచాయి. అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడి కూల్చివేసింది. అక్కడ ఉన్న బోయపల్లి ఎంక్లేవ్ కాలనీని పరిశీలించిన హైడ్రా అధికారులు.. అక్కడి రహదారికి అడ్డంగా నిర్మించిన ప్రహరీలను తొలగించారు. ఈ ప్రహరీల నిర్మాణం వలన ఇతర ప్లాట్ల యజమానులు తమ ఫ్లాట్లకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో బడంగిపేట మున్సిపాలిటీ అల్మాస్ గూడ విలేజీలోని బోయపల్లి ఎంక్లేవ్ కాలనీలో రహదారులకు అడ్డంగా నిర్మించిన ప్రహరీలను గురువారం తొలగించిన హైడ్రా.
Also Read: ఈసారి చార్‌ధామ్ యాత్రలో వీరికి నో ఎంట్రీ.. అలా చేస్తే వెనక్కి పంపిస్తామంటున్న అధికారులు
లేఅవుట్ లోని దాదాపు సగం ప్లాట్లను కలుపుతూ నిర్మించిన ప్రహారీతో యితర ప్లాట్ల యజమానులకు రహదారులు మూసుకుపోయాయి. అందులో భాగంగా.. హైడ్రా అధికారులు బోయపల్లి ఎంక్లేవ్ కాలనీ లేఅవుట్‌ను సమీక్షించి.. ప్రహరీలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రహరీ 240 గజాల మేరలో నిర్మించబడింది. ఇది కాలనీ భూ యజమానుల మధ్య రహదారికి అడ్డంగా ఉందని గుర్తించాయి. ఈ నిర్మాణం వల్ల ప్రజలకు రోజూ వారి పనులు చేసుకునేందుకు తీవ్ర అసౌకర్యం కలిగింది. హైడ్రా అధికారులు నిర్మాణాలను తొలగించి.. పర్యవేక్షణ చేయగా.. అక్కడి భూ యజమానులతో వాగ్వాదం జరిగింది. లేఅవుట్ ప్రకారం 240 గజాల మేర వుండాల్సిన పార్కును కబ్జాల నుంచి విడిపించిన హైడ్రా.
ఇది కూడా చదవండి: Pastor Praveen: నా భర్త చాలా మంచోడు.. కన్నీరు పెట్టిస్తోన్న ప్రవీణ్ భార్య మాటలు!
వాగ్వాదం కారణంగా పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలో స్థానిక పోలీసు ఇన్‌స్పెక్టర్ తిరుమలేశ్ అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో రహదారి సమస్యను పరిష్కరించడానికి.. నిర్మాణాలు తొలగించడం పట్ల అభినందనలు తెలిపారు. 1982 గ్రామపంచాయతీ లే ఔట్ వేయగా లేఅవుట్ యజమానులు 3 రహదారుల్లో ఆటంకాలను సృష్టించారు. తాజాగా మూడు చోట్ల రహదారులకు అడ్డుగా కట్టిన ప్రహరీలను హైడ్రా తొలగించింది.
Also Read: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్ కామెడీ అంటూ!
🔷 బడంగిపేట మున్సిపాలిటీ అల్మాస్గూడ విలేజీలోని బోయపల్లి ఎంక్లేవ్ కాలనీలో రహదారులకు అడ్డంగా నిర్మించిన ప్రహరీలను గురువారం తొలగించిన హైడ్రా.
— HYDRAA (@Comm_HYDRAA) March 27, 2025
🔷 లేఅవుట్ లోని దాదాపు సగం ప్లాట్లను కలుపుతూ నిర్మించిన ప్రహారీతో యితర ప్లాట్ల యజమానులకు మూసుకుపోయిన రహదారులు.
🔷 లేఅవుట్ ప్రకారం 240 గజాల… pic.twitter.com/LBzZJ47Ylr