Jubilee Hills By Elections: నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. షెడ్యూల్ విడుదల!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేయడానికి ముగ్గురి పేర్లను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ప్రతిపాదించింది. సీఎం సూచనలతో నవీన్‌యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డిల పేర్లను పీసీసీ ఏఐసీసీకి పంపినట్లు తెలుస్తోంది.
ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. 'పుష్ప 2' ఘటనపై అల్లు అర్జున్‌కు ఘాటుగా వార్నింగ్ ఇవ్వడంతో ఆయన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించారు.
పండుగ సెలవుల తర్వాత హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో మెట్రో స్టేషన్లకు జనం పోటెత్తారు. ఎల్బీ నగర్ వంటి స్టేషన్లలో ఎస్కలేటర్లు పనిచేయక, ప్లాట్‌ఫారంకు చేరడానికి గంటల సమయం పట్టి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఓ ప్రశ్న తెలంగాణ ఆర్టీసీలో కీలక మార్పులకు దారితీసింది. సీటు బెల్ట్ పెట్టుకోకపోతే సామాన్యులపై ఫైన్లు బాదుతారు. మరి RTC బస్సులో ఎన్ని సీట్లకు సీటు బెట్లులు ఉన్నాయని హైదరాబాద్ వ్యక్తి RTIతో ప్రశ్నించాడు. దీంతో RTC బస్సులో సీటు బెల్ట్ తప్పని సరి చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ కూడా ఈరోజు విడుదల చేయనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఎన్నికల కమిషన్ ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించనుంది.
హైదరాబాద్‌లోని టోలిచౌకిలోని ఓ రెస్టారెంట్లో కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల్లో నలుగురు విద్యార్థులతో సహా మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మొయినాబాద్ ప్రాంతంలో ఆదివారం పెద్దమంగళారంలోని చెర్రీ ఓక్స్ ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఫాంహౌస్‌లో 50 మంది ఇంటర్ విద్యార్థులు పార్టీ చేసుకుంటున్నారు. వారికి డ్రగ్ టెస్ట్ చేయగా.. ఇద్దరికి గంజాయి పాజిటివ్ వచ్చింది.
ఈమధ్యకాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త మార్గాలు ఎంచుకుని మరీ సైబర్ కేటుగాళ్లు అమాయకులు వల విసిరి లక్షలు, కోట్లు కాజేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు.