ఏంటీ రచ్చ..మీ ఇంట్లో గొడవ పడండి–మంచు విష్ణుకు సీపీ వార్నింగ్

ఫ్యామిలీ మ్యాటర్స్ రోడ్డు మీదకు తీసుకురావడంపై మంచు విష్ణుకు రాచకొండ సీపీ వార్నింగ్ ఇచ్చారు. తన కార్యాలయంలో విష్ణుకు గంటన్నసేపు క్లాస్ పీకారు సీపీ. ఇంకోసారి  ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని ఆదేశించారు.

New Update
11

నాలుగు రోజులుగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న డ్రామాకు ఎండ్ పలకమని హితవు పలకారు రాచకొండ సీపీ. ఇంట్లో విషయాలకు బయటకు వచ్చి గొడవపడడమేంటని ప్రశ్నించారు. దాదాపు గంట్నసేపు మంచు విష్ణును సీపీ విచారించారు. మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఇంకోసారి  ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని ఆదేశించారు. ఇంటిదగ్గర ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని విష్ణుకి సూచించారు సీపీ.  శాంతి భద్రతలు విఘాత కలిగించేలా వ్యవహరిస్తే లక్ష రూపాయల  జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read:  400 బిలియన్‌ డాలర్ల క్లబ్‌ లో మస్క్‌..!

నోటీసులకు రెస్పాండ్ అవ్వని విష్ణు..

అలాగే మనోజ్‌తో ఉన్న గొడవ గురించి కూడా విష్ణును అడిగి తెలుసుకున్నారు సీపీ. జల్ పల్లిలోని ఫాంహౌస్ లో  తన ప్రైవేట్ సెక్యూరిటీ ని పంపించాలని విష్ణును ఆదేశించారు సీపీ.  జిల్లా అడిషనల్ మేజిస్ట్రేట్ హోదాలో శాంతి భద్రతల పరిరక్షణ నిబంధనల బాండ్ పై సైన్ తీసుకున్నారు సీపీ సుధీర్ బాబు. ఈ విచారణకు మోహన్‌బాబు కూడా హాజరు కావాల్సి ఉంది. కానీ గొడవ కారణంగా ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. దీని కారణంగా మోహన్‌ బాబు పోలీసుల నోటీసులను హైకోర్టులో సవాల్ చేసిన..  మోహన్ డిసెంబర్  24వ తేదీ వరకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. మరోవైపు సీపీ ఆదేశాల మేరకు మంచు మనోజ్ నిన్న ఉదయం పోలీసుల విచారణకు హాజరయ్యారు. తమ ఫ్యామిలీలో జరుగుతోన్న పరిణామాలను సీపీకి వివరించారు. మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించనని సీపీకి రూ.లక్ష పూచికత్తుపై బాండ్ సమర్పించారు మనోజ్. 

Also Read: పాలలో ఖర్జూరం కలిపి తాగితే ఇన్ని లాభాలా.. ఈ ఆరోగ్య రహస్యం ట్రై చేయండి

అయితే మోహన్ బాబు, మనజ్ రెస్పాండ్ అయినట్లు విష్ణు పోలీసుల నోటీసులకు జవాబు ఇవ్వలేదు. కోర్టును కూడా ఆశ్రయించలేదు. దీంతో విష్ణుపై పోలీసులు సీరియస్ అయ్యారని సమాచారం. ఆ కారణంగానే రాత్రి 11 గంటలకు విష్ణును సీపీ ఎదుట హాజరుపరిచారని తెలుస్తోంది. 

Also Read: సోషల్ మీడియాలో అంతరాయం..రెండు గంటలపాటూ ఇబ్బందులు పడ్డ యూజర్లు

Also Read: GOOGLE: ఈ ఏడాది కూడా సౌత్ సినిమాలదే హవా..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mujra Party : మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ భగ్నం..ఏడుగురు అమ్మాయిలు అరెస్ట్!

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం ఏతబర్‌పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో అర్ద నగ్నంగా నృత్యాలు చేస్తున్న ఏడుగురు అమ్మాయిలు, 12మంది అబ్బాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

New Update
mujra party rangareddy

mujra party rangareddy

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం ఏతబర్‌పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. బర్త్ డే సెలబ్రెషన్స్ పేరుతో కొంతమంది యువకులు ముజ్రా పార్టీ ఏర్పాటు చేసినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని భగ్నం చేశారు. ఈ పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై నుంచి యువతులను రప్పించినట్టుగా పోలీసులు వెల్లడించారు.  

Also read :  ఒక్క మ్యాచ్ తో హాట్ టాపిక్ గా మారిన ప్రియాంశ్ ఆర్య..ఎవరీ కుర్రాడు?

Also read :  తండ్రితో మంచు మనోజ్ లొల్లి.. మోహన్ బాబు ఇంటివద్ద హై టెన్షన్!

ఏడుగురు అమ్మాయిలు, 12మంది అబ్బాయిలు 

ఈ ఘటనలో అర్ద నగ్నంగా నృత్యాలు చేస్తున్న ఏడుగురు అమ్మాయిలు, 12మంది అబ్బాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  యువకులు అందరూ పాత బస్తీకి చెందిన వారు కాగా  యువతుల్లో ముంబై నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ముజ్రా పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో ఫామ్‌హౌస్‌పై దాడులు చేశామని ఎస్‌వోటీ పోలీసులు వివరించారు. ఇక ఫామ్ హౌజ్ లో భారీ స్థాయిలో  డ్రగ్స్‌తో పాటు పెద్ద మొత్తంలో మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

Also Read :  ఎంతకు తెగించావమ్మా.. భర్తపై కోపంతో 5 నెలల బిడ్డను నీటిలో ముంచి చంపేసింది!

Also read :  Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!

birthday-celebrations | Mujra party | rangareddy | Moinabad Farm house | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-update | breaking news in telugu

Advertisment
Advertisment
Advertisment