/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-23-7.jpg)
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఖతార్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. దోహ నుంచి బంగ్లా దేశ్ వెళ్తున్న విమానం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో మెడికల్ ఎమెర్జెన్సీ కోసం ల్యాండ్ అయ్యింది. ప్రయాణీకుళ్లో ఓ మహిళకు తీవ్ర అస్వస్తతకు గురికాగా ఫ్లైట్ ఆపారు. ఆమెకు గుండెపోటు వచ్చినట్లు సాటి ప్రయాణికులు గుర్తించారు. పరిస్థితి విషమించడంతో వెంటనే ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ చేసి ఎయిర్ పోర్ట్ హాస్పిటల్‌కు తరలించారు. అయినపట్టికీ ఫలితం లేకపోయింది. హాస్పిటల్‌కు తీసుకొచ్చే సమయంలోనే ఆ మహిళ చనిపోయినట్లుగా వైద్యులు నిర్థారించారు. ఆమె పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎయిర్ పోర్ట్ సిబ్బంది ప్రయాణికురాలి వివరాలు సేకరిస్తున్నారు.