HYD: NMDC బోర్డు డైరెక్టర్ గా ప్రియదర్శిని గడ్డం

నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) డైరెక్టర్ (పర్సనల్)గా ప్రియదర్శిని గడ్డం నియమితులయ్యారు. దీంతో ఎన్ఎమ్డీసీ మొట్టమొదటి మహిళా ఫంక్షనల్ డైరెక్టర్ గా చరిత్ర సృష్టించారు. 

New Update
hyd

NMDC Dirctor Priyadarshini

ఎన్ఎమ్డీసీ కి మొట్టమొదటిసారిగా మహిళా డైరెక్టర్ నియమితులయ్యారు. హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వపు విద్యార్థిని అయిన ప్రియదర్శిని గడ్డాన్ని బోర్డు డేరెక్టర్ గా నియమిస్తూ  ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈరోజు భాధ్యతలు స్వీకరించారు కూడా. దీనికి ముందు ఆమె హైదరాబాద్‌లోని NMDC కార్పొరేట్ కార్యాలయం, నాగర్నార్‌లోని NMDC స్టీల్ లిమిటెడ్ రెండింటికీ చీఫ్ జనరల్ మేనేజర్(పర్సనల్ & అడ్మినిస్ట్రేషన్)గా బాధ్యతలు నిర్వహించారు. 

30 ఏళ్ళ అనుభవం..

ప్రియదర్శిని  1992లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా NMDCలో చేరారు. తర్వాత ఒక్కో మెట్టే ఎక్కుతూ ఇవాళ బోర్డు డైరెక్టర్ గా నియమితుయ్యే స్థాయికి ఎదిగారు. మైనింగ్ పరిశ్రమలో నాయకత్వ పాత్రల్లో మరింత మహిళలు ఉండటానికి మార్గం సుగమం చేశారు. ప్రియదర్శిని ఎన్ఎమ్డీసీలో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా మూడు దశాబ్దాలకుపైగా పనిచేసిన అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈమె బోర్డు డైరెక్టర్ గా జనవరి 31, 2026 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.

Also Read: Kerala: 65 లక్షల అప్పు కోసం వరుస హత్యలు...కేరళ మర్డర్స్ మిస్టరీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు