తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మీద కంప్లైంట్ ఇచ్చారు. దీనికి సంబంధించే నిన్న హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. అయితే చక్రధర్ గౌడ్ తనపై రాజకీయ కక్షతో ఫిర్యాదు చేశారని...ఇది తప్పుడు కేసని హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతుకు ముందు ఈ పిటిషన్ మీద విచారించిన హైకోర్టు డిసెంబర్ 30 వరకు హరీశ్ రావును అరెస్ట్ చేయొద్దని చెప్పింది. ఇప్పుడు దాన్ని జనవరి 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కౌంటర్ వేసేందుకు సమయం కావాలని ప్రతివాదులు కోరడంతో న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ విచారణను జనవరి 9కి వాయిదా వేశారు. అప్పటి వరకు అరెస్టు చేయరాదన్న గత ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపారు.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోరుతున్న పోలీసులు