Metro romance: హైదరాబాద్ మెట్రోలో రాసలీలలు.. అడ్డంగా బుక్కైన జంట!

హైదరాబాద్ మెట్రోలో ఓ యువజంట రెచ్చిపోయింది. చైతన్యపురి నుంచి ఎల్బీనగర్ వెళ్లిన ఈ ప్రేమజంట ట్రైన్‌లో అందరిముందే ముద్దుల్లో మనిగిపోయింది. ఒకరినొకరు కౌగిలించుకుని అసభ్యకరంగా తాకిన వీడియో వైరల్ అవుతోంది. ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు.

New Update
Lovers Romance on Hyderabad Metro

Lovers Romance on Hyderabad Metro

Metro romance: నేటి తరానికి కామం మత్తులో కళ్లు మూసుకుపోతున్నాయి. రహస్యంగా చేయాల్సిన పనిని నడి బజారులో కానిచ్చేస్తున్నారు. కొంతమంది ఇంకా మాలో జంతు ప్రవృత్తి పోలేదని నిరూపిస్తున్నారు. నడి రోడ్లపై అర్ధనగ్న ప్రదర్శనలు చేయడమే కాకుండా.. ఏకంగా రొమాన్స్ కూడా చేసేస్తున్నారు. ముద్దులు, కౌగిలింతలతో కంపరం రేపుతున్నారు. బస్సులు, ఆటోల్లోనే కాదు ఏకంగా భారీగా జనం ప్రయాణించే మెట్రో ట్రైన్లలో కొన్ని జంటలు రెచ్చిపోతున్నాయి. మనుషుల మధ్య ఉన్నామనే విచక్షణ మరిచి నీచంగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటికే సీట్లు లేక ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు.. ఇలాంటివారి చర్యల వల్ల ట్రైన్ ఎక్కాలంటే బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్ లో సోమవారం రద్దీగా ఉన్న ట్రైన్ లో ఓ యువజంట చేసిన పని చూస్తే తిట్టకుండా ఉండలేరు. 

శరీరాలను తడుముకుంటూ దారుణంగా..

ఈ మేరకు చైతన్యపురి స్టేషన్‌లో మెట్రో ఎక్కిన యువ జంట ఎల్బీనగర్ స్టేషన్ వరకు ప్రయాణించింది. అయితే ఎక్కిన కాసేపటికే మెట్రోలో అందరి ముందే రొమాన్స్ మొదలుపెట్టారు. ఎవరు ఏమీ అనకపోవడంతో మరింత రెచ్చిపోయిన కామాంధులు ఏకంగా ముద్దుల్లో మునిగిపోయారు. ఒకరినొకరు కౌగిలించుకుని శరీరాన్ని తడుముకుంటూ దారుణంగా ప్రవర్తించారు. ఇదంతా తోటి ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తుండగా.. భిన్నమైన కామెంట్స్ వెలువడుతున్నాయి. 

Also Read: న్యూ ఇయర్ గురించి ఎవరికీ తెలియని విషయాలు! ఆ దేశ ప్రజలు ఎందుకలా చేస్తారు?

Also Read: అర్చకులకు నెలకు రూ.18 వేలు.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు