/rtv/media/media_files/2025/03/06/l4H309V7Ymfy15FTgItI.jpg)
fraud 123 Photograph: (fraud 123)
సినిమా ప్రమోషన్ల బిజినెస్ చేస్తా అని మాయమాటలు చెప్పి కోట్లు కొట్టేశాడు ఓ కేటుగాడు. సీసీఎస్‌లో పోలీసులు విచారణలో విషయమంతా బయటకు తీశారు. హైదరాబాద్‌లో ఛత్రినాక అరుందతి కాలనీకి చెందిన ప్రైవేటు ఉద్యోగి.. తన మిత్రులతో కలిసి తరచూ గోవా వెళ్లొస్తుండేవాడు. ఎప్పటిలాగే 2024 అక్టోబరులో అక్కడి బిగ్‌డాడీ క్యాసినోకు వెళ్లాడు. అందులో శ్రీలంకకు చెందిన ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. వారు రిలీస్‌కు సిద్ధంగా ఉన్న సినిమాలకు ప్రమోషన్ ఈవెంట్స్ చేస్తుంటామని బాదితుడిని నమ్మించారు. అదే నెలలో ఉదయ్‌రాజ్ గచ్చిబౌలిలోని ఓ హోటల్‌కు రాగా.. బాధితుడు వెళ్లి కలిశాడు. త్వరలో విడుదలకానున్న చిత్రానికి ప్రమోషన్ చేసేందుకు అవకాశం వచ్చిందని ఉదయ్‌రాజ్ చెప్పాడు. OG సినిమా డైరెక్టర్ సుజిత్ ఫొటోలను చూపి నమ్మకం కలిగించాడు.
ఇది కూడా చూడండి: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..
హైదరాబాద్ వచ్చిన ఉదయ్ రాజ్‌ను వాట్సాప్ ద్వారా కలుసుకున్నాడు బాధితుడు. అమరన్ సినిమా ప్రమోషన్‌కు రూ.20 లక్షలిస్తే వారం రోజుల్లో రెట్టింపు లాభాలిస్తామంటూ హామీనిచ్చారు. రెండు దఫాలుగా ఆ ఇద్దరి బ్యాంకు ఖాతాల నుంచి.. అమరన్ సినిమాలో లాభాలు వచ్చాయంటూ రూ.25లక్షలు ఇచ్చారు. సరే డబ్బులు తీసుకొని ఇస్తున్నారు కదా అని బాధితుడి మరోసారి కూడా పెట్టుబడి పెట్టాడు. తరువాత సీతాపయనం, యూఐ, కంగువా, పుష్ప-2, గేమ్‌ఛేంజర్ సినిమాల ప్రమోషన్ పెట్టుబడి పేరిట ఆన్‌లైన్‌లో రూ.76 లక్షలు, విడతల వారీగా రూ.58 లక్షలు తీసుకున్నారు. బాధితుడు ఉప్పుగూడలోని ఇంటిని విక్రయించడంతోపాటు నగలు తాకట్టుపెట్టి, అప్పులు చేసి మొత్తం రూ.1.34 కోట్లు పెట్టుబడిగా వారికి ఇచ్చాడు. లాభాలు కాదు కదా.. అసలు కూడా ఇవ్వకుండా ఉదయ్‌రాజ్ తప్పించుకు తిరుగుతున్నాడు. మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!