Heavy rain : హైదరాబాద్‌ ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షం (VIDEO)

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం (ఈరోజు) మధ్యాహ్నం ఆకాశంలో మేఘావృతమైంది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా భారీ వర్షం కురుస్తోంది. టోలిచౌకి, మెహదీపట్నం ఏరియాలో వర్షం కురిస్తోంది. బంజారాహిల్స్‌, మాదాపూర్‌లో కుండపోత వర్షం పడుతోంది.

New Update

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఎండలు మండిపోతుండగా.. గురువారం (ఈరోజు) మధ్యాహ్నం ఆకాశంలో మేఘావృతమైంది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా భారీ వర్షం కురుస్తోంది. టోలిచౌకి, మెహదీపట్నం ఏరియాలో వర్షం కురిస్తోంది.
బంజారాహిల్స్‌, మాదాపూర్‌లో కుండపోత వాన పడుతుంది. భారీ వర్షం కారణంగా ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి తోడు పలు ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. పటాన్‌చెరు, నాంపల్లి, బేగంబజార్‌, సికింద్రాబాద్‌, పంజాగుట్టలోనూ భారీ వర్షం కురుస్తోంది.

Also read: BIG BREAKING: HCU భూముల వ్యవహారం.. రేవంత్ సర్కార్‌కు హైకోర్టు బిగ్ షాక్

హైదరాబాద్‌తో పాటు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment