/rtv/media/media_files/2026/02/12/ghmc-2026-02-12-14-49-52.jpg)
హైదరాబాద్(hyderabad) నగర పాలరనలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ని ప్రభుత్వం మూడు భాగాలుగా విభజించింది. నగరం శరవేగంగా విస్తరిస్తుండటంతో అధికార వికేంద్రీకరణ అవసరమని ప్రభుత్వం భావించింది. 1955 జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం ఈ కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది.ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్ కొనసాగుతారు. జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ జి. శ్రీజనను బదిలీ చేసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డిని బదిలీ చేసి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా శ్రీ రంజన్ నియమితులయ్యారు. ఈ విభజన ప్రక్రియ మొత్తాన్ని ఆయన పర్యవేక్షిస్తారు. ప్రస్తుతానికి GHMC హెడ్ ఆఫీస్ నుంచే ఈ పనులన్నీ జరుగుతాయి.
ఈ విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు చేరాయి. అలాగే మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్.బి. నగర్ జోన్లతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. ఇక మిగిలిన కీలక ప్రాంతాలైన శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు ప్రస్తుత GHMC పరిధిలోనే కొనసాగుతాయి. ఈ మూడు కార్పొరేషన్లు కూడా 1955 నాటి GHMC చట్టం ప్రకారమే స్వతంత్ర సంస్థలుగా పనిచేస్తాయి.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్: ఐటీ కారిడార్‌ను కలుపుతూ శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్: మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్: జీహెచ్ఎంసీ పేరును కొనసాగిస్తూ ..సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లలో లేని మిగతా ఆరు జోన్లు (శంషాబాద్, రాజేంద్రనగర్, చారి్మనార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్).
Also Read : బ్రిటిష్ చట్టసభలోకి తెలంగాణ బిడ్డ.. ఉదయ్ నాగరాజు అరుదైన గౌరవంతో రికార్డ్
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్:
శేరిలింగంపల్లి జోన్: నార్సింగి, పటాన్చెరు, అమీన్పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి.
కూకట్పల్లి జోన్: మాదాపూర్, ఆల్విన్ కాలనీ, కూకట్పల్లి, మూసాపేట్.
కుత్బుల్లాపూర్ జోన్: చింతల్, జీడిమెట్ల, కొంపల్లి, గాజుల రామారం, నిజాంపేట్, దుండిగల్, మేడ్చల్.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్:
మల్కాజిగిరి జోన్: కీసర, అల్వాల్, బోయిన్పల్లి, మౌలాలీ, మల్కాజిగిరి.
ఉప్పల్ జోన్: ఘట్కేసర్, కాప్రా, నాచారం, ఉప్పల్, బోడుప్పల్.
ఎల్బీనగర్ జోన్: నాగోల్, సరూర్‌నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్:
శంషాబాద్ జోన్: ఆదిభట్ల, బడంగ్పేట్, జల్ పల్లి, శంషాబాద్.
రాజేంద్రనగర్ జోన్: రాజేంద్రనగర్, అత్తాపూర్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, జంగంమెట్.
చార్మినార్ జోన్: సంతోష్ నగర్, యాకుత్‌పురా, మలక్‌పేట్, చార్మినార్, మూసారాంబాగ్.
గోల్కొండ జోన్: గోషామహల్, కార్వాన్, గోల్కొండ, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్.
ఖైరతాబాద్ జోన్: ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బోరబండ, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్.
సికింద్రాబాద్ జోన్: కవాడిగూడ, ముషీరాబాద్, అంబర్పేట్, తార్నాక, మెట్టుగూడ.
Also Read : జగ్గారెడ్డికి షాక్..కేసు నమోదు చేయాలని ఎస్పీని ఆదేశించిన ఈసీ
Follow Us