/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/heat-3-jpg.webp)
జనవరిలో సంక్రాంతి పండగ అయిన దగ్గర నుంచి ఎండలు మొదలయిపోయాయి. ఫిబ్రవరి మిడిల్ నుంచి అయితే వేసవికాలాన్ని తలపిస్తోంది. నిన్న ఒక్కరోజే హైదరాబాద్ లో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడితో అయిపోలేదు మరో ఐదు రోజులు ఎండ ఇలానే దంచికొడుతుంది అని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ. హైదరాబాద్లో ఈ ఐదు రోజులు 34- నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతాయని చెప్పింది. వేడి గాలులు వీస్తున్నాయని, అందుకే ఎండల తీవ్రత పెరుగుతోందని వివరించింది.
Also Read: Trump: ఉద్యోగుల తొలగింపు పై ప్రణాళికలు రెడీ చేయండి..ట్రంప్ యంత్రాంగం ఆదేశాలు!
11 తర్వాత అవసరమైతే తప్ప బయటకు రావొద్దు..
ఇక ఈ వేసవిలో సూర్యుడు తన తడాఖా చూపించనున్నాడని చెబుతున్నారు వాతావరణశాఖ నిపుణులు. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీళ్ళు ఎక్కువగా తాగాలని..ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ డీ హైడ్రేట్ అవకుండా ఉండాలని చెప్పారు. ఇప్పటి నుంచి అవసరమైతే తప్ప ఉదయం 11 తర్వాత బయటకు రావద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఏవైనా పనులుంటే ఉదయం 11 గంటల్లోపు.. సాయంత్రం 4 గంటల తర్వాత పెట్టుకోవాలంటున్నారు. హై టెంపరేచర్, వీక్నెస్, తీవ్రమైన దాహం, గొంతు ఎండిపోవడం, చర్మం పొడిబారడం, చెమటలు పట్టకపోవడం, చర్మం ఎర్రగా మారడం, శ్వాస సమస్యలు, హార్ట్ బీట్ పెరగడం, వికారం, వాంతులు, మూర్ఛ వంటి అనారోగ్య సమస్యలుంటే వడ దెబ్బ అని గ్రహించి హాస్పిటల్ కు వెళ్లాలని కోరుతున్నారు.
Also Read: AP: అన్నం కూడా తిననివ్వలేదు..అరెస్ట్ పై పోసాని భార్య