TS: నగరంలో ట్రాఫిక్ ను నియంత్రణకు ఫ్లై ఓవర్లు- సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్లో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు అవపరమైన అన్ని చర్యలూ వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంచారు. గ్రేటర్ హైదరాబాద్ పై సమీక్ష నిర్వహించిన ఆయన ఏడు ప్రధాన కూడళ్లలో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు.

New Update
hyd

CM Revanth Reddy

ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు, నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు గా చేపట్టిన డ్రోన్ సర్వే ను కోర్ అర్బన్ ఏరియా మొత్తం  నిర్వహించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు . గ్రేటర్ హైదరాబాద్ మీద రేంత్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. నగరంలో గృహాలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని సూచించిన సీఎం.. తద్వారా నగరంలో నివాస ప్రాంతాలకు మౌలికసదుపాయాల విషయంలో అవసరాలకు తగిన విధంగా ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాటు చేసే వీలుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఏడు ప్రధాన కూడళ్ళపై ఫ్లై ఓవర్లు..

ఇక నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అధునాతన పద్ధతులను వినియోగించాలని.. అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకుని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమైన 7 కూడళ్లలో ఫ్లై ఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే వీటికి టెండర్ల ను పిలువాలని ఆదేశించారు. భూసేకరణ, ఇతర పనులను పూర్తి చేసి వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని. అధికారులకు సీఎం సూచించారు.

Also Read: Manipur: మణిపూర్ లో సీఆర్పీఎఫ్ జవాన్ కాల్పులు...ఇద్దరు మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijayashanthi: పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాటతీస్తా.. రాములమ్మ స్ట్రాంగ్ వార్నింగ్!

పవన్ భార్య అన్నా లెజినోవాపై జరుగుతున్న ట్రోలింగ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఘాటుగా స్పందించారు. పుట్టుకతోనే వేరే మతం ఐనప్పటికీ ఆమె హిందూ ధర్మాన్ని నమ్మారని చెప్పారు. అలాంటి మహిళను ట్రోల్ చేస్తే తాటా తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. 

New Update

Vijayashanthi: పవన్ భార్య అన్నా లెజినోవాపై ట్రోలింగ్‌పై- కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి - ఘాటుగా స్పందించారు. విదేశాల నుంచి వచ్చి, పుట్టుకతోనే వేరే మతం ఐనప్పటికీ-- అన్నా.. హిందూ ధర్మాన్ని నమ్మారని పొగిడేశారు.- అగ్నిప్రమాదం నుంచి కొడుకు బయటపడినందుకు..-- కృతజ్ఞతగా శ్రీవారికి తల నీలాలు ఇచ్చారు.  అలాంటి మహిళను ట్రోల్ చేయడం తప్పు- అని మండిపడ్డారు. పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాటా తీస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. 

అత్యంత అసమంజసం..

'దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు.  సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు. 
హరహర మహాదేవ్. జై తెలంగాణ' అంటూ తన అభిప్రాయం వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

మార్క్‌ శంకర్‌పై కూడా ..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కి సింగపూర్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల వీరు హైదరాబాద్ వచ్చారు. అయితే ఈ క్రమంలో కొందరు దుండగులు సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు భార్య అన్నా లెజినోవా.. కుమారుడు మార్క్‌ శంకర్‌పై కూడా సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు. అయితే వీరిని గోప్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా గూడూరులో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గుంటూరు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్‌గా గుర్తించారు. అయితే వీళ్లు అల్లు అర్జున్ అభిమానులుగా తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు