Mohan Babu Court Case : సినీ నటుడు మంచు మోహన్ బాబుకు ఎల్బీనగర్ కోర్టులో చుక్కెదురైంది. జల్‌పల్లిలోని ఇంటి వివాదంపై గతంలో మోహన్ బాబు కోర్టులో పిటిషన్ వేశారు. మంచు మనోజ్ ఇంట్లోకి రాకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ వేశారు. ఇంట్లో ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ మంచు మనోజ్‌పైన కోర్ట్‌ను ఆశ్రయించారు మోహన్ బాబు. గతంలో మోహన్ బాబుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే కోర్ట్‌ను తప్పుదోవ పట్టించారంటూ కొన్ని ఆధారాలను మనోజ్ న్యాయవాది కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీంతో మోహన్ బాబుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును నిన్న (మంగళవారం) కొట్టివేసింది ఎల్బీనగర్ కోర్టు. అంతే కాకుండా తప్పిదానికి పాల్పడిన కోర్ట్ క్లర్క్‌కు న్యాయస్థానం మెమో జారీ చేసింది.అయితే ఇప్పుడు మళ్లీ మంచు మనోజ్ జల్ పల్లి లో ఉన్న తన తండ్రి మోహన్ బాబు ఇంటి వద్ద బైఠాయించడంతో మళ్లీ వివాదం మొదటి కొచ్చింది.
Also read : ఒక్క మ్యాచ్ తో హాట్ టాపిక్ గా మారిన ప్రియాంశ్ ఆర్య..ఎవరీ కుర్రాడు?
మరోవైపు మంచు ఫ్యామిలీ వివాదాలకు ఇంకా ఫుల్‌స్టాప్ పడినట్లు లేదు. ఆస్తులకు సంబంధించి మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకటిగా ఉండగా... మంచు మనోజ్ మాత్రం ఒంటరిగానే పోరాడుతున్నారు. జల్‌పల్లిలోని నివాసానికి సంబంధించి ఇప్పటికే మోహన్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. తన ఇంట్లో ఉన్న వారిని ఖాళీ చేయిచాలంటూ పోలీసులకు తెలిపారు. దీనికి సంబంధించి విచారణకు రావాల్సిందిగా మంచు మనోజ్‌నోటీసులు కూడా వెళ్లాయి. మనోజ్ విచారణను కూడా ఎదుర్కున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా జల్‌పల్లిలోని నివాసం వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత నెలకొంది. జల్‌పల్లి నివాసంలోకి తనను రానీయడం లేదంటూ ఇంటి వద్ద కూర్చుని మంచు మనోజ్ ఆందోళనకు దిగారు. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా జల్‌పల్లి నివాసరం పరిసరాల్లోకి ఎవరూ రాకుండా అడ్డుకున్నారు.
Also read : తండ్రితో మంచు మనోజ్ లొల్లి.. మోహన్ బాబు ఇంటివద్ద హై టెన్షన్!
ఈరోజు ఉదయం జల్ పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటి వద్ద ధర్నాకు దిగిన మంచు మనోజ్.. తనకు జరిగిన అన్యాయం గురించి మీడియాతో చెప్పుకొచ్చారు. ఏప్రిల్ ఒకటిన మా పాప పుట్టినరోజు కోసం నేను జైపూర్ వెళ్ళాను. అయితే అదే రోజు మా ఇంట్లో విధ్వంసం సృష్టించారు. ఈ గొడవలను కావాలనే ఫ్యామిలీకి గొడవగా మార్చి మమ్మల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు. మాది ఆస్తి గొడవ కాదు.. స్టూడెంట్స్ విషయాలలో స్టార్ట్ అయిన గొడవ ఇది. నా ఇంట్లో జరిగిన బీభత్సంపై పోలీసులను అడిగితే.. మీరు ఇక్కడ ఉండడం లేదు కదా అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఇప్పటివరకు మూడు ఎఫ్ఐఆర్లు నమోదైనా.. ఒక్క ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదు. అన్ని ఆధారాలు ఉన్నా ఎందుకు పోలీసులు మాకు సహకరించడం లేదు. నేను ఊర్లో ఉన్నప్పుడు ఏం చేయడం లేదు. కానీ ఊరు దాటిన వెంటనే విష్ణు ప్లానింగ్ తో ఇల్లు ధ్వంసం చేశాడు. కన్నప్ప పోటీగా భైరవ సినిమా రిలీజ్ చేస్తున్నానని , నాపై కోపం. కూర్చుని మాట్లాడదామంటే విష్ణు ముందుకు రావడం లేదు. విష్ణు కావాలని నా కెరియర్ నాశనం చేస్తున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు మనోజ్.
Also read : Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!
ఈ గొడవలను కావాలనే ఫ్యామిలీ గొడవగా మార్చి పిచ్చోళ్లను చేస్తున్నారని మండిపడ్డారు. తమది ఆస్తి గొడవ కాదని.. స్టూడెంట్ విషయాల్లో స్టార్ట్ అయిన గొడవ అని చెప్పారు. తాను ఊర్లో ఉన్నప్పుడు ఏమీ చేయడం చేతగాక ఊరు దాటిన వెంటనే విష్ణు ప్లానింగ్‌తో ఇల్లు ధ్వంసం చేశారని మండిపడ్డారు. ‘నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలి అన్నది అతని లక్ష్యం ’ అంటూ వాపోయాడు. జలపల్లి ఇంట్లోకి వెళ్లడానికి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం వెళ్లనీయడం లేదని మంచు మనోజ్ పేర్కొన్నారు.
Also Read : ఎంతకు తెగించావమ్మా.. భర్తపై కోపంతో 5 నెలల బిడ్డను నీటిలో ముంచి చంపేసింది!