/rtv/media/media_files/2025/03/26/58JUo0TcYmGX7zRfwJw9.jpg)
Hyd Accident
Hyd Accident: రాష్ట్రంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అతి వేగం, నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో రోడ్డు ప్రమాదం కలకలం సృష్టిస్తోంది. సికింద్రాబాద్ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సికింద్రాబాద్‌లోని మహంకాళి పీఎస్ పరిధిలో రోడ్డుపై వేగంగా వెళ్తున్న బైక్‌ను కారు ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
అతి వేగంతో..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అంతేకాకుండా ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతులు బన్సీలాల్‌పేటకు చెందిన ప్రణయ్ (18), బోయగూడాకు చెందిన అక్షిత్(21)గా గుర్తించారు. ఘటన చూసిన స్థానికులు కారు డ్రైవర్ అతివేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులకు తెలిపారు.
సికింద్రాబాద్....
— Telangana Awaaz (@telanganaawaaz) March 26, 2025
మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం...
కారు, టూ వీలర్ ఢీ.. ఇద్దరు మృతి
హర్లే డేవిడ్సన్ బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి...
స్పాట్ లోనే ఒకరు మృతి చెందగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి...@hydcitypolice pic.twitter.com/Y4XGz3QhYV
ఇది కూడా చదవండి: నల్ల ద్రాక్ష, పచ్చని ద్రాక్షలో ఏది మంచిది.. ఏది ఆరోగ్యానికి ఉపయోగకరం?
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం ఇద్దరు యువకుల మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుమారుల మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: చుండ్రు చిరాకు పెడుతుందా.. ఇలా ఇంట్లోనే సింపుల్‌గా వదిలించుకోండి
( hyd-accidents | ts-crime | ts-crime-news | latest-news )