/rtv/media/media_files/2025/01/06/kBW2rhoMTqAEJDQXwTHH.jpg)
Hyderabad Habsiguda car caught fire
హైదరాబాద్‌లోని హబ్సిగూడలో దారుణమైన ప్రమాదం జరిగింది. ఒక కారు మంటల్లో బూడదైపోయింది. రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు డ్రైవర్ అప్రమత్తమై కారును పక్కకు నిలిపి.. వెంటనే అందులోంచి బయటకు వచ్చేశాడు. ఎలగో అతడు ముందుగా గమనించి బండి దిగడంతో పెను ప్రమాదం తప్పింది.
Also Read: ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!
కాగా ఆ కారు ఉప్పల్ నుంచి తార్నాక వైపు వెళ్తుండగా హబ్సిగూడ చౌరస్తా రాకముందు ఈ ఘటన సంభవించింది. ఇక వెంటనే సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు సమాచారాన్ని అందుకుని హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ రోడ్డులో ఏర్పడిన ట్రాఫిక్‌ను నియంత్రించే పనిలో పడ్డారు. ఈ విషయం తెలిసి స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ దేవుని దయవల్ల ఏం జరగలేదని మాట్లాడుకుంటున్నారు.
Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..
USలో తెలంగాణ వాసులు మృతి
అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతి రెడ్డి (35), మనవడు హార్వీన్ (6), కూతురు అత్త సునీత (56) ప్రాణాలు కోల్పోయారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడంతో టేకులపల్లి గ్రామం శోకసద్రంలో మునిగిపోయింది.
Also Read: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు