/rtv/media/media_files/2025/01/24/Dr6PnyDIo3l5mQdxj0LK.jpg)
meerpet murder case Photograph: (meerpet murder case)
మీర్ పేట మహిళ హత్యకేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సంచలనం సృష్టించింది. మాజీ జవాన్ గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని హత్యచేసి ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, పోలీసులు విచారణలో మాధవిని తానే హత్యచేసినట్లు గురుమూర్తి ఒప్పుకున్నప్పటికీ పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇంట్లోనే తన భార్యను హత్యచేశానని, అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలుముక్కలు చేసి, ఎముకలను కాల్చి పొడిచేసి బయటపడేసినట్లు గురుమూర్తి పోలీసుల విచారణ లో చెప్పిన సంగతి తెలిసిందే.
పోలీసులు గురుమూర్తి నివాసం ఉంటున్న ఇంట్లో అణువణువు తనిఖీలు చేపట్టారు. అయితే, ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇటీవల మరోసారి గురుమూర్తి నివాసంలో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి దర్యాప్తు బృందం తనిఖీ చేసి ఎట్టకేలకు ఆధారాలను సేకరించారు. ఆ ఆధారాలను డీఎన్ఏ రిపోర్టుకు పంపించారు. తాజాగా ఈ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది.
మళయాళం సినిమాను...
గురుమూర్తి (Guru Murthy) తన భార్యను మళయాళం సినిమా స్ఫూర్తితో హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఓటీటీ (OTT) లో సూక్ష్మదర్శిని అనే మళయాళం సినిమాను గురుమూర్తి చాలాసార్లు చూసినట్లు, ఆ సినిమా ఆధారంగా భార్య హత్యకు కుట్ర చేసినట్లు తెలుస్తుంది. మాధవిని హత్యచేసిన తరువాత యాసిడ్, రసాయనాలతో ఆమె శరీర భాగాలను కాల్చి ముద్దగా మార్చేశాడు. ఆ తరువాత దుర్వాసన రాకుండా స్ప్రే కెమికల్స్ వాడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
నిందితుడి చేతికి కాలిన గాయాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో మాధవి మిస్సింగ్ కేసును హత్యకేసుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో మాధవి మిస్సింగ్ కేసు (Madhavi Missing Case) ను హత్యకేసుగా నేడు పోలీసులు ప్రకటించే అవకాశం ఉంది. డీఏఎన్ఏ రిపోర్టు రాగానే గురుమూర్తిపై హత్యకేసును నమోదు చేయనున్నారు పోలీసులు.
గురుమూర్తి తన భార్యను హత్యచేసిన తరువాత ముక్కలు ముక్కలు చేసినట్లు పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. అయితే, ఇందుకు సంబంధించి ఒక్క పీస్ కూడా దొరక్కుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. సైంటిఫిక్ ఆధారాలతో పోలీసులు కేసు ఛేదించారు. త్వరలో న్యాయమూర్తి ముందు గురుమూర్తిని పోలీసులు హాజరపర్చనున్నారు. హత్యకేసుతో పాటు ఎవిడెన్స్ ట్యాంపర్ సెక్షన్లు జత చేయనున్నారు.
Also Read: 'నా ఉద్యోగం పోయింది, పెళ్లి క్యాన్సిల్ అయ్యింది'.. సైఫ్ కేసులో అరెస్టయిన బాధితుడి ఆవేదన
Also Read: Starlink: స్టార్‌లింక్ బీటా టెస్టింగ్ రేపే.. శాటిలైట్ నుంచి సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్