/rtv/media/media_files/2025/02/21/6AEaY0KWzNXIYcCz4l7t.jpg)
Hyderabad Bahadurpura major fire broke out
Bahadurpura Fire Accident
హైదరాబాద్‌లోని బహదూర్ పురాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లారీ మెకానిక్ షాప్‌లో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న మూడంతస్తుల భవనానికి ఆ మంటలు వ్యాపించాయి. వెంటనే భవనంలో ఉన్న ప్రజలు బయటకు పరుగులు తీశారు. అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!
ప్రేమను అంగీకరించలేదని
ఇదిలా ఉంటే తాజాగా ఓ యువతి తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మూడేండ్లుగా ప్రేమించిన అమ్మాయి కాదందని ప్రేమించిన యువతి ఇంటి ముందు ప్రేమికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్ లింగంపల్లికి చెందిన 21 సంవత్సరాల సోను డిగ్రీ చదువుతున్నాడు. ఇక హౌసింగ్ బోర్డ్ కాలనీ, బృందావనం కాలనీకి చెందిన అంబిక ఎల్‌ఎల్‌బీ స్టూడెంట్. ఇద్దరు గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు.
ఇది కూడా చూడండి: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!
అయితే ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థాలు రావడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. ప్రియురాలు ప్రియుడ్ని కాదనడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సోను ఈ రోజు ఉదయం ప్రియురాలి ఇంటికి వచ్చాడు. ప్రేయసి ఇంటి ముందు ఉన్న మొదటి అంతస్తు పై ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేశాడు.
అంతటితో ఆగకుండా ఫ్లోర్ క్లీన్ చేసే లిక్విడ్ (ఫ్లోర్ క్లీనర్) త్రాగాడు. చుట్టూ ఉన్నవారు ఎంత సర్ధిచెప్పిన వినకపోవడంతో స్థానికులు 100కు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. మొదటి అంతస్తు పైకెక్కి హల్చల్ చేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే 108 కి ఫోన్ చేశారు. అంబులెన్స్ లో అతనికి ప్రథమ చికిత్స చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!