/rtv/media/media_files/2025/01/22/sXF3uu4HJSFUKvLijjjc.jpg)
Husband Kills Wife in Meerpet, Hyderabad
రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను చంపి మృతదేహాన్ని మక్కలు ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత కుక్కర్‌లో వేసి ఊడికించాడు. ఈ క్రూరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. గురుమూర్తి(45) అనే వ్యక్తి జనవరి 18న తన భార్య వెంకట మాధవి(35) కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read: ఐటీ రైడ్స్‌పై స్పందించిన దిల్‌రాజు.. ఏమన్నారంటే..?
అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే గురుమూర్తిని వారు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయం బయటపడింది. తన భార్య వెంకట మాధవిని తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్య తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశానని.. ఆ తర్వాత కుక్కర్‌లో ఉడికించానని చెప్పారు. అనంతరం వాటిని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలోనే గురుమూర్తి చెప్పిన విషయాలపై పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. మృతదేహం ఆనవాళ్ల కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారో తెలుసా ?
అయితే గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేశారు. ఆ తర్వాత రిటైరయ్యారు. ప్రస్తుతం కంచన్‌బాగ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం ఇతడికి వెంకటమాధవితో పెళ్లి జరిగింది. వీళ్లకు ఇద్దరు సంతానం. వెంకటమాధవి కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలో మరిన్ని వివరాలు బయటపెడతామని మీర్‌పేట పోలీసులు వెల్లడించారు.
Also Read: గుడ్‌న్యూస్.. ఏఐ సాయంతో 48 గంటల్లో క్యాన్సర్‌కు వ్యాక్సిన్