Honey Trap: హనీ ట్రాప్ వల్లే వాజేడు SI సూసైడ్..! వాజేడు ఎస్సై సూసైడ్ వెనుక హనీ ట్రాప్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ కేసును వేగంగా విచారిస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేసి యువతి ఎస్సైని పెళ్లి చేసుకోవలని ఒత్తిడి చేసింది. గతంలొనూ ముగ్గురు యువకులను హనీట్రాప్ చేసినట్లు సమాచారం. By K Mohan 04 Dec 2024 in తెలంగాణ క్రైం New Update షేర్ చేయండి ములుగు జిల్లా వాజేడు మండల ఎస్పైగా విధులు నిర్వహిస్తున్న హరీశ్ డిసెంబర్ 2న (సోమవారం) తెల్లవారుజామున తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నారు. గోదావరి బ్రిడ్జి వద్ద ఉన్న ఫెరిడో రిసార్ట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో ఎన్వైరీ చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఎస్సైని నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువతి హనీ ట్రాపింగ్‍కు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. Also Read: AP: అయ్యప్ప భక్తులకు తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు! Honey Trap - Wajedu SI Harish ఎస్సై రుద్రారపు హరీశ్ (28) సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న సమయానికి యువతి అక్కడే ఉన్నదని పోలీసులకు ఆధారాలు లభించాయి. పోస్టుమార్టం కోసం డెడ్‌బాడీని పోలీసులు ములుగు హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు రావడాన్ని చూసి యువతి రిసార్ట్ నుంచి పరార్ అయ్యింది. Also Read: TG-Ap: 55 సంవత్సరాల తరువాత ఓ రేంజ్ లో కంపించిన తెలంగాణ..! అయితే నవంబర్ 14న ఎస్సై హరీశ్ నిశ్చితార్థం అదే యువతితో ఫిక్స్ అయ్యింది. ఎంగేజ్ మెంట్ క్యాన్సల్ చేసుకుందామని హరీశ్ నిర్ణయించుకున్నాడు. దానికి ఒప్పుకోని యువతి ములుగు జిల్లాలోని గోదావరి బ్రిడ్జి వద్ద ఉన్న ఫెరిడో రిసార్ట్‌లో డిసెంబర్ 1న కలిసింది. ఎస్సై తనని పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి చేసింది. లేదంటే ఆమె కుటుంబ సభ్యులతో దర్నాకు దిగుతానని ఎస్సైని బెదిరించింది. Also Read: ApsRTc: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ ఏమన్నారంటే! ఎస్సై హరీశ్ అతని ఫ్రెండ్స్ తో చెప్పించాలని చూసినా.. ఆ యువతి వినలేదు. గతంలో కూడా ఆ యువతి పలువురిని హని ట్రాప్ చేసి వారిపై కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేసినట్లు సమాచారం ఉంది. డబ్బు, పలుకుబడి ఉన్నవారే టార్గెంట్ గా చేసుకొని యువతి బ్లాక్ మెయిల్ చేస్తుంది. యువతికి గతంలోనే ముగ్గురు యువకులతో లవ్ ట్రాక్ ఉందని తేలింది. యువతి గురించి పూర్తిగా తెలుసుకున్న హరీశ్ పెళ్లికి నిరాకరించాడు. ఆ తరహాలోనే హరీశ్ ను యువతి పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది. హరీశ్ ఆమెకు ఎంత నచ్చజెప్పాలని చూసిన యువతి వినిపించుకోలేదు. ప్రస్తుతం యువతి పోలీసుల అదుపులోనే ఉంది. దీంతో పోలీసులు వాజేడు ఎస్సై హరీశ్ సూసైడ్ కేసు విచారణలో వేగం పెంచారు. Also Read: వాళ్లిద్దరు ఓకే అంటే కుర్చీ,టెంట్ కూడా రెడీ..మంత్రి పయ్యావులు కౌంటర్ #honey-trap #si #harish #sucide #mulugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి