BIG BREAKING: నర్సంపేటలో హైటెన్షన్.. రోడ్డుపైనే శంకర్ గౌడ్ మృతదేహం

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సూసైడ్ చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌ గౌడ్ మృతదేహాన్ని కార్మికులు డిపో దాకా తీసుకెళ్లేందుకు యత్నించారు. మృతదేహాన్ని రోడ్డు పైనే ఉంచి నిరసన తెలిపారు.

New Update
RTC Employees Protest

RTC Employees Protest

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సూసైడ్ చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌ గౌడ్ మృతదేహాన్ని కార్మికులు డిపో దాకా తీసుకెళ్లేందుకు యత్నించారు. నర్సంపేట డిపో దగ్గరే మృతదేహానికి నివాళులర్పిస్తామని తెలిపారు. కానీ దీనికి పోలీసులు ఒప్పుకోలేదు. మృతదేహాన్ని తీసుకెళ్లకుండానే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు, కార్మికులకు మధ్య ఘర్షణకు దారితీసింది.  దీంతో  ఆర్టీసీ కార్మికులు మృతదేహాన్ని రోడ్డు పైనే ఉంచి నిరసన తెలిపారు. వీళ్లకి బీజేపీ నేతలు కూడా మద్దతు తెలిపారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. శంకర్‌గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.  

Also Read: బీజేపీలో చేరిక.. RTVకి మల్లారెడ్డి కోడలు సంచలన ఇంటర్వ్యూ!

 శంకర్‌గౌడ్‌ మృతదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ తేల్చిచెప్పారు. అనవసరంగా మమ్మల్ని అడ్డుకుని శాంతి భద్రతలకు విఘాతం ఎందుకు కలిగిస్తున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు డిపోకు తరలించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆయనకు నివాళులు అర్పిస్తే నష్టమేంటని నిలదీశారు.  

Also Read: తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్

అనంతరం బండి సంజయ్‌కి వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. శంకర్‌గౌడ్‌ కుటుంబ సభ్యులు, ఆర్టీసీ కార్మికుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని సూచనలు చేశారు. శంకర్ గౌడ్ 22 ఏళ్లపాటు నర్సంపేట ఆర్టీసీ డిపోలో సేవలందించారని పేర్కొన్నారు. ఆ ప్రదేశానికి తీసుకెళ్తేనే ఆయన ఆత్మకు శాంతి ఉంటుందని ఆర్టీసీ కార్మికులు, ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు