HCU Land Issue Telangana Governament key decision
Hyderabad: HCU వివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంచ గచ్చిబౌలి భూములపై వెనక్కు తగ్గినప్పటికీ భూములు వర్సిటీకి అప్పగించేందుకు సిద్దంగా లేమని స్పష్టం చేసింది.1500 ఎకరాల్లో ఎకోపార్క్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది.
ఎకోపార్క్ నిర్మాణానికి ప్లాన్ సిద్ధం..
ఈ మేరకు సెంట్రల్ వర్సిటీని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్సిటీ భూముల్లో ఎకోపార్క్ నిర్మాణానికి ప్లాన్ సిద్ధం చేశామన్నారు. ఆందోళనల్లో పాల్గొన్నవారు నార్త్ ఇండియా విద్యార్థులేనని, తెలంగాణ వారు ఎవరు లేరన్నారు.-- తెలంగాణ అభివృద్ది చూడలేక విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. -తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
ఇక విద్యార్థులతో వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలని, అవసరమైతే ఒకడుగు వెనక్కు వేసినా పర్వాలేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రుల ఉపసంఘానికి సూచించారు. రికార్డులు, కోర్టు తీర్పు ప్రకారం భూమి ప్రభుత్వానిదైనా, ప్రస్తుత వివాదం నేపథ్యంలో జాగ్రత్తగా అడుగేయాలని తెలిపారు. తప్పుడు ప్రచారం చేసి, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలనుకొనేవారికి అవకాశం ఇవ్వకుండా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు.
ఇది కూడా చూడండి: వాట్సాప్ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
lands | telugu-news | today telugu today telugu news
Komatireddy Raj Gopal Reddy : నా మంత్రి పదవిని అడ్డుకుంటున్నది జానారెడ్డే...రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కొంతకాలం నుంచి తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తోన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీస్థాయిలో కుట్రలకు తెర లేపారన్నారు.
Komatireddy Raj Gopal Reddy
MLA Komatireddy Raj Gopal Reddy :గత కొంతకాలం నుంచి తనకు మంత్రి పదవి వస్తుందని వస్తుందని ఆశిస్తోన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పదవిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీస్థాయిలో కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. మంత్రి పదవి ఇస్తానని పార్టీ హామీ ఇచ్చిందని. తన మంత్రి పదవి విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
జానారెడ్డి వంటివారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారన్నారు.జానారెడ్డి 30 ఏళ్లపాటు మంత్రి పదవి అనుభవించారు.రంగారెడ్డి, హైదరాబాద్‌కు పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అంటూ ప్రశ్నించారు.
Also Read : కల్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ట్రైలర్ చూశారా? కెవ్ కేక
అధిష్టానం వద్ద తనకు మంత్రి పదవి ఖాయమైనా.. కావాలనే జానా పదేపదే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. 25 ఏళ్లు మంత్రి పదవిలో జానారెడ్డి ఉన్నది సరిపోదా అని ధ్వజమెత్తారు. అధిష్టానం తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవి ఇస్తే.. దాన్ని బాధ్యతగా భావిస్తానని కామెంట్ చేశారు. మంత్రి పదవి కోసం తాను ఎన్నడూ అడుక్కోలేదని.. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు, అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. సమర్థత ఉన్న నాయకులకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలంటూ రాజగోపాల్ రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కాగా తనకు మంత్రి పదవి అనగానే కొంతమంది భయపడుతున్నారని ఆయన అన్నారు. తనకు అధిష్ఠానం మంత్రి పదవి ఇస్తానంటే పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు చెమటలు పడుతున్నాయన్నారు.
Also Read : 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!
అయితే మంత్రి వర్గ విస్తరణపై సీనియర్ నేత జానారెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మంత్రి పదవుల ఎంపికలో అనుభవం, ఆయా నాయకుల సామర్థ్యాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు.
Also Read : ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..
అధిష్టానం తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవి ఇస్తే.. దాన్ని బాధ్యతగా భావిస్తానని కామెంట్ చేశారు. మంత్రి పదవి కోసం తాను ఎన్నడూ అడుక్కోలేదని.. అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. సమర్థత ఉన్న నాయకులకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలంటూ రాజగోపాల్ రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కాగా తనకు మంత్రి పదవి అనగానే కొంతమంది భయపడుతున్నారని ఆయన అన్నారు.
Also Read : 'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి