HCA VS SRH: సద్దుమణిగిన HCA-SRH వివాదం.. ఏం జరిగిందంటే ?

హెచ్‌సీఏ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు ప్రతినిధులు మంగళవారం సమావేశమయ్యారు. ఒప్పందం ప్రకారం 10 శాతం టికెట్లు ఇస్తామని SRH చెప్పింది. గతంలో లాగే అన్ని కేటగిరిల్లో పాసులు కేటాయించాలని HCA కోరింది. HCAకు టికెట్లు యథావిధిగా కొనసాగుతాయని SRH సీఈవో షణ్ముగం తెలిపారు.

New Update
SRH VS HCA

SRH VS HCA

తెలంగాణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య ఫ్రీ టికెట్ల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం హెచ్‌సీఏ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు ప్రతినిధులు మంగళవారం సమావేశమయ్యారు. ఒప్పందం ప్రకారం 10 శాతం టికెట్లు ఇస్తామని SRH చెప్పింది.అయితే గతంలో ఉన్నలాగే అన్ని కేటగిరిల్లో పాసులు కేటాయించాలని HCA కోరింది. దీనిపై ఎస్‌ఆర్‌హెచ్‌ సీఈవో షణ్ముగంతో ఇరువర్గాల ప్రతినిధులు ఫోన్‌లో మాట్లాడారు. HCA కేటాయించే టికెట్లు యథావిధిగా కొనసాగుతాయని షణ్ముగం చెప్పారు. దీంతో ఈ టికెట్ల వివాదం ఇరువర్గాల మధ్య సద్దుమణిగినట్లు తెలుస్తోంది.  

Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!

ఐపీఎల్‌ 2025 ఫ్రీ టికెట్ల కోసం HCA తమపై ఒత్తిడి చేస్తోందని SRH ఆరోపిస్తోంది. ఈ విషయంలో గత రెండేళ్లుగా బెదిరింపులకు గురిచేస్తోందని చెబుతోంది. మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా HCA ఫ్రీపాస్‌ల విషయంలో గొడవ చేసిందని ఆరోపించింది. దీనిపై సీఎం రేవంత్ కూడా సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఇప్పటికే విజిలెన్స్ అధికారులకు ఆయన ఆదేశించారు.

వివాదం ఏంటంటే ? 

తమిళనాడుకు చెందిన సన్‌నెట్‌వర్క్ యాజమాన్యంలోని సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీ ఉన్న సంగతి తెలిసిందే. ఇది ఐపీఎల్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి హైదరాబాద్‌ను తమ హోమ్‌ గ్రౌండ్‌గా ఎంచుకొని ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌లో ఆడుతోంది. ఐపీఎల్‌ ఆడే సమయంలో ఉప్పల్‌ స్టేడియాన్ని రెంట్‌కు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రతీ మ్యాచ్‌కు హెచ్‌సీఏకు రూ.కోటి చెల్లిస్తోంది. మ్యాచ్ టికెట్ల విక్రయాలను కూడా సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీనే చూసుకుంటోంది. స్టేడియ కేపాసిటీ మొత్తం 39 వేలు. ఇందులో 10 శాతం అంటే 3900 టికెట్లను కాంప్లిమెంటరీ పాసుల రూపంలో SRH.. హెచ్‌సీఏకు ఫ్రీగా అందిస్తోంది.  

Also Read: మరికొన్నిరోజుల్లో బీజీపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు.. రేసులో ఉంది వీళ్లే

వీటిలో రూ.750 ధర టికెట్ల నుంచి రూ.20 వేలు విలువ చేసే కార్పొరేట్ బాక్స్‌ పాసులు కూడా ఉన్నాయి. ఈ కార్పొరేట్ బాక్స్‌ పాసుల విషయంలోనే సన్‌రైజర్స్‌కు, హెచ్‌సీఏకు మధ్య విభేదాలు వచ్చాయి. ఉప్పల్‌ స్టేడియంలోని సౌత్‌ స్టాండ్‌ ఫస్ట్‌ఫ్లోర్‌లోని ఎఫ్‌-12ఏ బాక్స్‌లో గత పదేళ్ల నుంచి హెచ్‌సీఏకు 50 టికెట్లు కేటాయిస్తోంది. అయితే ఈ సీజన్‌లో మాత్రం ఆ బాక్స్‌ కెపాసిటీ 30 టికెట్లు మాత్రమే. దీంతో అదనంగా మరో 20 టికెట్లు ఇవ్వాలని SRHను HCA అడిగగా.. దీనికి ఎస్‌ఆర్‌హెచ్‌ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎక్స్‌ట్రా టికెట్ల కోసం HCA బెదిరించిందని SRH ఆరోపిస్తోంది. గత రెండేళ్లుగా ఇలాంటి సమస్యలు కొనసాగుతున్నాయని, ఇక సహించలేమని SRH.. HCA ట్రెజరీకి మెయిల్ చేసిందన్న వార్తలు వచ్చాయి.

sun-risers-hyderabad | rtv-news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy Rains: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్, వికారాబాద్,  మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

Also Read: తెలంగాణలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి!

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో జల్లులు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉండగా గంటసేపు వర్షంతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్  జారీ చేసింది. 

Also Read: భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’

 

Advertisment
Advertisment
Advertisment